ఇరాన్ నిఘా శాఖ మంత్రి మహమ్మద్ అలవీ అమెరికాను హెచ్చరించారు. తమ దేశంపై విధించిన అంతర్జాతీయ ఆంక్షలు కొనసాగిస్తే అణ్వాయుధాలు తయారు చేసే దిశగా అడుగులు వేస్తామన్నారు. ఇరాన్ అణు ఒప్పందాన్ని ఉల్లంఘించే అవకాశం ఉందంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
"సుప్రీం లీడర్ రూపొందించిన ఫత్వా ప్రకారం అణు ఒప్పందాన్ని పాటిస్తున్నాము. కానీ ఇరాన్‌ను అణ్వాయుధాలు రూపొందించే దిశగా వారు ప్రేరేపిస్తే అది మా తప్పు కాదు."
-మహమ్మద్ అలవీ, నిఘా శాఖ మంత్రి
ఇదీ చదవండి : ఇరాన్‌పై ఆంక్షలు తొలగించే ప్రసక్తే లేదు: బైడెన్