ETV Bharat / international

లెబనాన్​లో భారీ పేలుళ్లకు కారణం చెప్పిన ప్రధాని

లెబనాన్​లో భారీ పేలుళ్లకు అమ్మోనియం నైట్రేటే కారణమని అధికారులు వెల్లడించారు. తొలుత ఏదైనా దాడి జరిగిందా? అని అనుమానించారు. కానీ ఓ గోదాములో నిల్వఉంచిన భారీ రసాయనాలే ప్రమాదానికి కారణమని ధ్రువీకరించారు. దీనికి బాధ్యులైన వారు తగిన మూల్యం చెల్లించక తప్పదని లెబనాన్‌ ప్రధాని హసాన్‌ దియాబ్ హెచ్చరించారు.

Fireworks, ammonium nitrate likely fueled Beirut explosion
లెబనాన్ భారీ పేలుళ్లకు కారణం
author img

By

Published : Aug 5, 2020, 5:16 PM IST

లెబనాన్‌ రాజధాని బీరుట్‌ భారీ పేలుళ్లకు వణికిపోయింది. తొలుత ఏదైనా దాడి జరిగిందా? అనే కోణంలోనూ అనుమానించారు. కానీ, ఈ పేలుళ్లకు అమ్మోనియం నైట్రేట్‌ కారణమని తాజాగా లెబనాన్‌ అధికారులు ప్రకటించారు. ఓ గోదాములో నిల్వ ఉంచిన భారీ రసాయనాల కారణంగానే ఇంతటి పేలుళ్లు సంభవించాయని వెల్లడించారు.

నగరంలోని ఓడరేవు గోదాములో నిల్వఉంచిన 2700టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ ఈ పేలుళ్లకు కారణమని అధికారులు తేల్చారు. గత ఆరు సంవత్సరాలుగా భారీ రసాయనాలను గోదాములోనే ఉంచినట్లు గుర్తించారు. ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా ఈ స్థాయిలో రసాయనాలను నిల్వ ఉంచడం బాధ్యతారాహిత్యమని లెబనాన్‌ ప్రధాని హసాన్‌ దియాబ్‌ అన్నారు. దీనిపై ఎట్టి పరిస్థితుల్లోనూ మౌనం వహించమని, కారణమైనవారు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.

బీరుట్‌లో మంగళవారం జరిగిన పేలుళ్లలో దాదాపు 100మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే దాదాపు 4 వేల మంది గాయపడినట్లు అంచనా వేస్తున్నారు. భారీ పేలుళ్ల ధాటికి కూలిపోయిన భవనాల శిథిలాల్లో చిక్కుకుపోయిన వారికోసం గాలింపుచర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. వందల సంఖ్యలో భవనాలు ధ్వంసమయ్యాయి.

ఇదీ చూడండి: భారీ పేలుడుపై కిమ్​, జిన్​పింగ్​ మౌనం ఎందుకు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.