రంజాన్ పండగ వేళ.. సిరియాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అజాజ్ పట్టణంలోని మసీదు వద్ద కారు బాంబు పేలుడు జరిపి ఘాతుకానికి ఒడిగట్టారు టర్కీ అనుకూల ఉగ్రవాదులు. ఈ ఘటనలో 17 మంది మరణించారు. మరో 20 మందికి పైగా గాయాలయ్యాయి. మృతుల్లో నలుగురు చిన్నారులున్నారు.
పట్టణ ప్రధాన కేంద్రంలోని మసీదులో ఇఫ్తార్ విందు ముగించుకొని బయటికొస్తున్న ప్రజలే లక్ష్యంగా దాడికి యత్నించారు ముష్కరులు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
అల్ రక్కా ప్రాంతంలో 10 మందిని బలిగొన్న కారు బాంబు పేలుడు జరిగిన మరుసటి రోజే ఈ ఘటన జరగడం గమనార్హం. టర్కీ వ్యతిరేక... కుర్దిష్ల నియంత్రణలో ఉంటుందీ అజాజ్ పట్టణం.
ఇదీ చూడండి: