ETV Bharat / international

అమెరికాకు షాక్- ఆ విమానాలను అడ్డుకున్న తాలిబన్లు - తాలిబన్ల తాజా వార్తలు

అఫ్గాన్​ను​ తాలిబన్లు (afghan thaliban attack) ఆక్రమించిన తర్వాత వందలాది మంది విదేశీయులు ఇంకా అక్కడే చిక్కుకుపోయారు. అయితే.. సుమారు 1000 మందిని తాలిబన్లు అడ్డుకుంటున్నారని యూఎస్​ మీడియా ఆదివారం వెల్లడించింది. ఇంతకూ వారిని నిలిపి ఉంచడానికి కారణమేంటి?.. వారి నుంచి ఏం ఆశిస్తున్నారు?.

Evacuation from Afghan
అఫ్గాన్​లో నిలిచిన విమానాలు
author img

By

Published : Sep 6, 2021, 11:34 AM IST

అఫ్గానిస్థాన్​ను​ వీడాలనుకునే(Evacuation from Afghan) సుమారు 1000 మందిని తాలిబన్లు అడ్డుకుంటున్నారని అమెరికా​ మీడియా ఆదివారం వెల్లడించింది. ఇందులో అమెరికా పౌరులతో పాటు ఇతర దేశాలకు వీసాలున్న అఫ్గాన్​వాసులు ఉన్నారని పేర్కొంది. అఫ్గాన్​ ఎయిర్​పోర్టుల్లో(afghan airport situation) టేక్​ ఆఫ్ కావడానికి చాలా విమానాలు సిద్ధంగా ఉన్నా.. అనుమతి లభించట్లేదని తెలిపింది. అమెరికా​, తాలిబన్లకు మధ్య చర్చలు జరుగుతున్నందునే వారిని అఫ్గాన్ వీడకుండా అడ్డుకుంటున్నారని తెలిపింది. ఎయిర్​పోర్ట్​ల్లోకి రాకుండానే వారిని అడ్డుకుంటున్నారని పేర్కొంది.

అందుకోసమేనా..?

అమెరికా సహకారంపై స్పష్టమైన హామీ ఆశించే తాలిబన్లు ఇలా చేస్తున్నారని పెంటగాన్​కు చెందిన ఓ అధికారి తెలిపారు. ఒకవేళ వారిని అడ్డుపెట్టుకుని ఏదైనా ఆశిస్తే ఒప్పుకునేదేలేదని సీనియర్ అధికారి మైక్​ ముల్రాయ్​ అన్నారు.

మజర్- ఏ- షరీఫ్​ ఎయిర్​పోర్ట్​లో అమెరికన్లకు చెందిన ఆరు విమానాలను తాలిబన్లు నిలిపి ఉంచారని అమెరికా విదేశాంగ వ్యవహారాల కమిటీ సీనియర్ అధికారి మైకెల్​ ఎమ్​సీ కాల్​ తెలిపారు.

ఇదీ చదవండి:గర్భంతో ఉన్న మహిళా పోలీస్ దారుణ హత్య- తాలిబన్ల పనే!

సంబరాల పేరుతో 17 మందిని కాల్చి చంపిన తాలిబన్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.