యూఏఈలోని అబుదబిలో నిర్వహించే నెలవారీ లాటరీలో ముగ్గురు భారతీయులు 5 మిలియన్ డాలర్ల జాక్పాట్ కొట్టారు.
బిగ్ టికెట్ రాఫెల్ డ్రాలో కేరళ కన్నూర్ జిల్లాకు చెందిన జిజేశ్ కొరోతన్ 20 మిలియన్ దిర్హమ్(5 మిలియన్ డాలర్లు)ను కైవసం చేసుకున్నారని గల్ఫ్ మీడియా తెలిపింది. ఈయన 15 ఏళ్లగా రస్ అల్ ఖైమాలో నివసిస్తూ డ్రైవర్గా పనిచేస్తున్నారు. ఈయనతో పాటు లాటరీ గెలిచిన మరో ఇద్దరూ డ్రైవర్లే.
"ఈ నెల ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. కనీసం పని కూడా దొరకలేదు. కుటుంబాన్ని పోషించడానికి చాలా ఇబ్బంది పడుతున్నా. ఇలాంటి పరిస్థితుల్లో ఈ లక్కీ డ్రా నాకు ఓ కొండంత అండగా నిలిచింది. ప్రస్తుతం గెలుచుకున్న ఈ నగదును ఏడో తరగతి చదువుతున్న నా కూతురి ఉన్నత చదువులకు, నేను నా స్నేహితులు కలిసి ప్రారంభించిన కారుల వ్యాపారానికి ఉపయోగిస్తా.
-- జిజేశ్ కొరోతన్, జాక్పాట్ విజేత
కొవిడ్-19 నివారణలో భాగంగా ప్రజలు లేకుండానే ఈ ఫేస్బుక్, యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా లాటరీ విజేతలను ప్రకటించారు.
ఇదీ చదవండి: పాక్కు 'అండర్వేర్ మాస్కులు' పంపిన చైనా