ETV Bharat / international

రష్యా కిరాయి సైన్యం అధినేత ప్రిగోజిన్ దుర్మరణం.. పుతిన్​పై తిరుగుబాటు చేసిన 2నెలలకే.. - prigozhin killed

Yevgeny Prigozhin Death : రష్యా ప్రైవేటు సైన్యం అధినేత యెవ్‌గెనీ ప్రిగోజిన్ దుర్మరణం పాలయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న ప్రవేటు జెట్​ కుప్పకూలడం వల్ల చనిపోయారు. ఈ ఘటనలో ప్రిగోజిన్​తో సహా 10 మంది మృతిచెందినట్లు రష్యా సివిల్ ఏవియేషన్ ఏజెన్సీ ప్రకటించింది.

Yevgeny Prigozhin Death
Yevgeny Prigozhin Death
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 24, 2023, 6:32 AM IST

Updated : Aug 24, 2023, 7:23 AM IST

Wagner Group Chief Dead : రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఇటీవల తిరుగుబావుటా ఎగురవేసిన ప్రైవేట్‌ సైన్యం వాగ్నర్‌ గ్రూప్‌ అధినేత యెవ్‌గెనీ ప్రిగోజిన్‌ దుర్మరణం చెందారు. ప్రిగోజిన్‌ ప్రయాణిస్తున్న ప్రైవేటు జెట్‌ కుప్పకూలడం వల్ల (Prigozhin Plane Crash).. ఆయన చనిపోయారు. ప్రిగోజిన్‌ సహా అందులో ఉన్న మొత్తం 10 మంది మృతి చెందినట్లు.. రష్యా సివిల్ ఏవియేషన్‌ ఏజెన్సీ తెలిపింది. మాస్కోకు దాదాపు 100 కిలో మీటర్లు దూరంలోని తెవర్‌ ప్రాంతంలో ప్రయాణికులతో కూడిన జెట్‌ కూలినట్లు వెల్లడించింది. ఆ విమాన ప్రయాణికుల జాబితాలో.. ప్రిగోజిన్‌ కూడా ఉన్నట్లు తెలిపింది.

Prigozhin Wagner Death : మాస్కో నుంచి సెయింట్‌పీటర్స్‌బర్గ్‌కు వెళ్తున్న ప్రైవేటు జెట్‌ కూలి.. మృతిచెందిన వారిలో ఏడుగురు ప్రయాణికులతో పాటు ముగ్గురు సిబ్బంది ఉన్నారు. కుప్పకూలిన జెట్‌ ప్రిగోజిన్ పేరున ఉన్నట్లు సమాచారం. అయితే, క్రెమ్లిన్​పై తిరుగుబావుటా ఎగురవేసిన దాదాపు రెండు నెలల లోపే ప్రిగోజిన్ దుర్మరణం పాలవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో పాటు రష్యా ఎయిర్​ ఫోర్స్​ కమాండర్​ సెర్గీ సురోవికన్​ను తొలగించినట్లు రష్యా మీడియా ఇటీవల పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రిగోజిన్ విమానం కుప్పకూలడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఉక్రెయిన్‌పై.. సైనిక చర్యలో భాగంగా కొన్నాళ్లు రష్యా సైనిక బలగాలకు అండగా ఉన్న ప్రిగోజిన్‌.. జూన్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌, ఆయన ప్రభుత్వంపై.. ఎదురుతిరిగారు. పుతిన్‌ సైనిక నాయకత్వాన్ని కూలదోసేందుకు.. అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా.. రష్యా ఉలిక్కిపడింది. బెలారస్‌ అధ్యక్షుడు లుకషెంకో మధ్యవర్తిత్వంతో వాగ్నర్‌ బృందాల తిరుగుబాటుకు తెరపడింది.

ఎవరీ ప్రిగోజిన్..?
Wagner Group Chief Prigozhin : రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే ప్రిగోజిన్‌ను.. పుతిన్‌ షెఫ్‌గా వ్యవహరిస్తుంటారు. 1980ల్లో దొంగతనం, దోపిడీ కేసుల్లో ప్రిగోజిన్‌ దాదాపు 9 ఏళ్ల జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చారు. 1990ల్లో పుతిన్‌కు-ప్రిగోజిన్‌కు పరిచయం ఏర్పడింది. 2000లో పుతిన్‌ రష్యా అధ్యక్షుడు అయ్యారు. మరోవైపు.. ప్రిగోజిన్‌ రెస్టారెంట్లు ఇతర వ్యాపారాలను విస్తరించారు. 2001 నుంచి పుతిన్‌ సన్నిహిత వర్గాల్లో ప్రిగోజిన్‌ కనిపిస్తూనే ఉన్నాడు. రష్యా ప్రభుత్వానికి చెందిన సైనిక, పాఠశాల ఫుడ్‌ కాంట్రాక్టులు ఇతనికే దక్కాయి. ఆ తర్వాత 2014లో వాగ్నర్‌ పీఎంసీ నిర్వహణలో ప్రిగోజిన్‌ పాత్ర కూడా బయటకు వచ్చింది.

రష్యాలోనే ప్రిగోజిన్​.. 'వాగ్నర్‌' గ్రూప్‌ చీఫ్‌ ఇంటిపై దాడులు.. భారీగా బంగారం స్వాధీనం!

తిరుగుబాటు తర్వాత ప్రిగోజిన్‌తో పుతిన్‌ భేటీ!.. డీల్​ అప్పుడే కుదిరిందా?

Last Updated : Aug 24, 2023, 7:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.