US Aid To Ukraine: రష్యా దాడులతో సైనికంగా, ఆర్థికంగా చితికిపోతున్న ఉక్రెయిన్‌కు అగ్రరాజ్యం అమెరికా మరోమారు ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఉక్రెయిన్‌కు 820 మిలియన్ డాలర్ల సైనిక సాయాన్ని అందించనున్నట్లు శ్వేతసౌధం వెల్లడించింది. దీనితో పాటు ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే సరికొత్త క్షిపణి వ్యవస్థను ఉక్రెయిన్‌కు ఇవ్వనున్నట్లు పేర్కొంది.
గత కొద్ది రోజులుగా ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాల్లో రష్యా క్షిపణులతో విరుచుకుపడుతున్న నేపథ్యంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. యుద్ధం ప్రారంభం నుంచి ఇప్పటివరకూ 7 బిలియన్ డాలర్ల సైనిక సాయాన్ని ఉక్రెయిన్‌కు అందించినట్లు అమెరికా పేర్కొంది. 8.8 బిలియన్ డాలర్ల ఆయుధాలు, సైనిక శిక్షణకు కూడా కట్టుబడి ఉన్నట్లు తెలిపింది
18 మంది బలి..ఉక్రెయిన్‌పై రష్యా దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. రష్యా చేస్తున్న క్షిపణి దాడుల్లో ఉక్రెయిన్ బలగాలతో పాటు సామాన్య పౌరులు సైతం మృత్యువాత పడుతున్నారు. తాజాగా తీర ప్రాంత నగరం ఒడెసాలోని తొమ్మిది అంతస్తుల నివాస భవనంపై రష్యా క్షిపణిని ప్రయోగించింది. ఈ దాడిలో 18మంది ప్రాణాలు కోల్పోగా 30మంది గాయపడినట్లు ఉక్రెయిన్ వర్గాలు తెలిపాయి. రష్యా దాడులను తప్పించుకునేందుకు భూగర్భ స్థావరాల్లో ఉక్రెయిన్ వాసులు తలదాచుకుంటున్నారు.
ఇవీ చదవండి: 'వచ్చే పదేళ్లలో కోటి మందికి బాల్యవివాహాలు.. అదే కారణం!'
నేర విచారణకు మస్తిష్క తరంగాల విశ్లేషణ.. త్వరలోనే సరికొత్త సాంకేతికత!