ETV Bharat / international

అంధుల పాఠశాలలో మంటలు.. 11 మంది బాలికలు సజీవ దహనం

ఉగాండాలోని ఓ అంధుల పాఠశాలలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 11 మంది బాలికలు మరణించారు.

Uganda school fire
రోధిస్తున్న మృతుల కుటుంబ సభ్యులు
author img

By

Published : Oct 25, 2022, 3:16 PM IST

Updated : Oct 25, 2022, 6:15 PM IST

ఉగాండాలోని అంధుల బోర్డింగ్ స్కూల్​లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 11 మంది బాలికలు మరణించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి విషమంగా ఉంది.
ఉగాండా రాజధాని కంపాలాకు సమీపంలోని ముకునోలో ఈ దుర్ఘటన జరిగింది. అంధుల కోసం ఏర్పాటు చేసిన సలామా రెసిడెన్షియల్ పాఠశాల డార్మిటరీలో సోమవారం అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందులో నిద్రిస్తున్న బాలికలు సజీవ దహనమయ్యారు. మృతుల వయసు 7 నుంచి 10 ఏళ్ల మధ్య ఉంటుందని అధికారులు తెలిపారు. మంటల తీవ్రతకు బాలికలు మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయని, డీఎన్​ఏ పరీక్షలు చేస్తే తప్ప మృతులను గుర్తించడం సాధ్యం కాదని చెప్పారు.

uganda school fire
ప్రమాదానికి గురైన అంధుల పాఠశాల భవనం

చిన్నారుల గదిలో మంటలు చెలరేగడానికి ఇంకా కారణాలు తెలియలేదు. పోలీసులు, సైనికులు పాఠశాలను తమ అధీనంలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉగాండా పర్యటనలో భాగంగా బ్రిటన్​ యువరాణి యాన్ శుక్రవారం ఈ బడిని సందర్శించాల్సి ఉండగా ఈ దుర్ఘటన జరిగింది.
ఉగాండాలో గతంలోనూ ఇదే తరహాలో పాఠశాలల్లో అగ్నిప్రమాదాలు జరిగాయి. అయితే.. మంటలు ఆర్పేందుకు తమ వద్ద అవసరమైన సామగ్రి లేదని సలామా పాఠశాల నిర్వాహకుడు కినుబు చెప్పారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పందించలేదని వాపోయారు.

uganda school fire
రోధిస్తున్న మృతుల కుటుంబ సభ్యులు
uganda school fire
రోధిస్తున్న మృతుల కుటుంబ సభ్యులు

పాఠశాలలో కాల్పులు.. ఇద్దుర మృతి
అమెరికా సెయింట్​ లూయిస్​లోని ఓ పాఠశాలలో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఓ టీచర్​, ఓ విద్యార్థి మరణించగా.. ఆరుగురు గాయపడ్డారు. గన్​తో కాల్పులు జరిపిన వ్యక్తిపై పోలీసులు దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు, పాఠశాల సిబ్బంది వెంటనే.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

సోమవారం ఉదయం 9 గంటల సమయంలో ఓ అగంతుకుడు సెంట్రల్ విజువల్ అండ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ హైస్కూల్‌లో పొడవాటి గన్​తో వచ్చి దాడి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దుండగుడిపై ఎదురు కాల్పులు జరిపారు. పోలీసులు రావడానికి ముందే ఆ వ్యక్తి పాఠశాలలోని టీచర్​ను, ఓ అమ్మాయిని చంపి.. మరో ఆరుగురిని గాయపరిచాడని పోలీసు అధికారి మైఖేల్ సాక్ మీడియాకు తెలిపారు. దాడి చేసిన వ్యక్తికి దాదాపు 20 ఏళ్లు ఉంటాయని, అయితే అతడు ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉందన్నారు. మృతుల వివరాలను పోలీసులు వెల్లడించలేదు.

Last Updated : Oct 25, 2022, 6:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.