ETV Bharat / international

'90 శాతం నకిలీవే..' ట్విట్టర్​పై మస్క్​ మళ్లీ ఆరోపణలు - ఎలాన్‌ మస్క్‌

Twitter Elon Musk : ట్విట్టర్‌ డీల్​ను రద్దు చేసుకున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్​ మస్క్.. మరోసారి ఆ సంస్థపై ఆరోపణలు చేశారు. తాను చేసే ట్వీట్లపై వచ్చే కామెంట్లలో 90శాతం నకిలీవేనని (స్పామ్‌/బాట్‌) అన్నారు.

twitter-elon-musk
twitter-elon-musk
author img

By

Published : Sep 7, 2022, 8:56 PM IST

Twitter Elon Musk : ట్విట్టర్‌ కొనుగోలుకు ప్రయత్నించిన ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌.. కొన్ని కారణాలు చెబుతూ ఆ డీల్‌ను రద్దు చేసుకున్నాడు. అయితే, ఆ డీల్‌ను ప్రతిపాదించిన నాటి నుంచే ట్విట్టర్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తోన్న ఆయన.. రద్దు తర్వాత కూడా ఆ సామాజిక మాధ్యమ వేదికపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ట్విటర్‌లో దాదాపు 20శాతం ఖాతాలు నకిలీవేనంటూ చెబుతూ వస్తున్నారు. తాజాగా ఇదేవిషయాన్ని మరోసారి ఉద్ఘాటించిన మస్క్‌.. తాను చేసే ట్వీట్లపై వచ్చే కామెంట్లలో 90శాతం నకిలీవేనని (స్పామ్‌/బాట్‌) అన్నారు.

మీకు వచ్చిన లైక్‌ల సంఖ్యలో అసలైన యూజర్లు, బాట్స్‌ నుంచి వచ్చే వాటిలో ఏమేరకు ఉంటాయని ఓ యూజర్‌ అడిగిన ప్రశ్నకు ఎలాన్‌ మస్క్‌ స్పందించారు. ట్విట్టర్‌ యూజర్లలో 20శాతం నకిలీవేనని ఉద్ఘాటించిన ఆయన.. తాజాగా తన ట్వీట్‌కు వచ్చిన ఓ రిప్లై గురించి వివరించారు. క్రిప్టోకరెన్సీ ఎక్ఛేంజీ సంస్థ బైనాన్స్‌ సీఈఓ చాంగ్‌పెంగ్‌ ఝావో పేరుతో వచ్చిన రిప్లై కూడా నకిలీదే అని అన్నారు. దాన్ని స్క్రీన్‌షాట్‌ తీసి పోస్టు చేసిన మస్క్‌.. తన పోస్టులకు వచ్చే కామెంట్లలో 90శాతం బాట్‌ల నుంచే వస్తాయన్నారు.

ట్విట్టర్‌లో ప్రతి పది అకౌంట్లలో ఎనిమిది నకిలీవేనని పేర్కొంటూ ఇటీవల ఓ సైబర్‌నిపుణుడు ఇచ్చిన నివేదికపైనా ఎలాన్‌ మస్క్‌ స్పందించారు. ట్విట్టర్‌ చెబుతున్నట్లుగా అవి ఐదు శాతం కాదని.. అంతకంటే ఎక్కువే (దాదాపు 20శాతం) ఉంటాయని మరోసారి అనుమానం వ్యక్తం చేశారు.

ఇదిలాఉంటే, ట్విట్టర్​ను సొంతం చేసుకునేందుకు మస్క్‌ గతంలో 44 బిలియన్‌ డాలర్లతో ఒప్పందం చేసుకున్నారు. అయితే, నకిలీ ఖాతాలకు సంబంధించి ట్విట్టర్‌ పూర్తి సమాచారం ఇవ్వలేదని, విలీన ఒప్పందంలోని పలు నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపించారు. ట్విట్టర్‌లో చెప్పిన దానికంటే స్పామ్‌ ఖాతాలు నాలుగింతలు ఎక్కువగా ఉన్నాయన్న ఆయన.. ట్విట్టర్‌ నుంచి సరైన సమాచారం రాకపోవడంతో చివరకు ఒప్పందం నుంచి తప్పుకున్నారు.

ఇవీ చదవండి : బ్రిటన్​ ప్రధానమంత్రిగా లిజ్ ట్రస్.. నియమించిన క్వీన్​ ఎలిజబెత్​ 2

పుతిన్​ సమక్షంలో యుద్ధ విన్యాసాలు.. 3వేల మిలిటరీ విభాగాల నుంచి సేనలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.