ETV Bharat / international

తుర్కియేలో 1100 సార్లు ప్రకంపనలు.. 19వేలు దాటిన భూకంప మరణాలు

భూకంపం ధాటికి కకావికలమైన తుర్కియే, సిరియాల్లో ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు తుర్కియే, సిరియాల్లో మరణాల సంఖ్య 19,300 దాటింది. భూకంపం తర్వాత 1,117 సార్లు భూమి కంపించినట్లు తుర్కియే విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. విపత్తు ఎదుర్కొవడంలో విఫలమయ్యారంటూ వస్తున్న విమర్శలను తుర్కియే అధ్యక్షుడు అంగీకరించారు. మరోవైపు, ఇండోనేషియాలో భూకంపం వల్ల నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

turkey syria earthquake
turkey syria earthquake
author img

By

Published : Feb 9, 2023, 8:25 PM IST

Updated : Feb 9, 2023, 9:49 PM IST

ప్రకృతి విలయ తాండవానికి తుర్కియే, సిరియాల్లో మరణ మృదంగం మోగుతోంది. ఇప్పటికే మృతుల సంఖ్య 19,300 దాటినట్లు తుర్కియే విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. జపాన్​లోని ఫుకుషిమా మహా విపత్తును దాటి మరణాల సంఖ్య నమోదైంది. పేకమేడల్లా కూలిన భవనాల కింద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారికోసం రెస్క్యూ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు. వేలాదిమంది తమ ఇళ్లను కోల్పోవడంతో నిరాశ్రయులై రోడ్డున పడ్డారు. రాత్రుల్లు గడ్డకట్టే చలిలో బహిరంగ ప్రదేశాల్లోనే తలదాచుకున్నారు. లక్షా పదివేల మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు విపత్తు నిర్వహణ దళం వెల్లడించింది. 2 డజన్లకుపైగా దేశాలు రెస్క్యూ సిబ్బందిని పంపించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. భూకంపం ధాటికి దెబ్బతిన్న కుటుంబాలకు ఆర్థిక సాయం అందించనున్నట్లు తుర్కియే అధ్యక్షుడు స్పష్టం చేశారు.

గత సోమవారం 7.8 తీవ్రతతో భూకంపం సంభవించిన తర్వాత ఇప్పటివరకు 1,117 సార్లు భూమి కంపించినట్లు తుర్కియే విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. వరుస ప్రకంపనలతో బలహీనంగా ఉన్న భవనాలు కూలిపోతున్నాయి. దీంతో ప్రమాద తీవ్రత పెరగడంతో పాటు సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు చెబుతున్నారు. విమానాశ్రయాలు, కీలక నౌకాశ్రయాలు కూడా దెబ్బతినడం వల్ల ప్రపంచ దేశాల సాయం అక్కడకు చేరడం కష్టతరంగా మారింది. ఒక్కో భవన శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోగా.. వారిని కాపాడేందుకు కనీసం 10 మంది సహాయక సిబ్బంది కూడా అందుబాటులో లేరు. శిథిలాలను తొలగించడానికి సరైన యంత్రాలు లేకపోవడంతో తుర్కియే అధ్యక్షుడు తయ్యిప్‌ ఎర్డోగాన్‌ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. సహాయక చర్యల్లో లోపాలు ఉన్నాయని అంగీకరించిన ఎర్డోగాన్.. ఘోర విపత్తును ముందే ఊహించిన సిద్ధపడటం సాధ్యం కాదన్నారు.

భూకంపం ధాటికి సర్వం కోల్పోయి వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. గడ్డకట్టే చలిలో వారంతా తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చలిని తట్టుకునేందుకు వెచ్చదనం కోసం పార్కుల్లోని బెంచీలు, పిల్లల దుస్తులను కాల్చేస్తున్నారు. ఇలాంటి హృదయ విదారక దృశ్యాలెన్నో భూకంప ప్రభావితం ప్రాంతాల్లో కన్పిస్తున్నాయి. ఈ విషాదానికి అంతమెక్కడో తెలియక తుర్కియే వాసులు క్షణక్షణం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. శిథిలాల కింద రోజుల తరబడి చిక్కుకుని.. ప్రాణాల కోసం పోరాడుతున్న చిన్నారుల్ని సహాయక బృందాలు రక్షిస్తున్నాయి. మరోవైపు..చనిపోయిన కుటుంబీకుల మృతదేహాల పక్కనే చిక్కుకుని ప్రాణాల కోసం పోరాడుతున్న వ్యక్తుల దృశ్యాలు కలచివేస్తున్నాయి. మరోవైపు.. ప్రకృతి ప్రకోపానికి బలైన తుర్కియే, సిరియాలకు ప్రపంచ దేశాలు సాయం అందిస్తూనే ఉన్నాయి.

ఇండోనేషియాలో భూకంపం..
ఇండోనేషియాలోని తూర్పున ఉన్న పాపువా ప్రావిన్స్‌లో భూకంపం సంభవించింది. ఈ ప్రకృతి విపత్తుకు నలుగురు ప్రాణాలు కోల్పోయరు. జయపురాలోని నివాస ప్రాంతాల్లో రిక్టర్‌ స్కేల్‌పై 5.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. పాపువా ఉత్తర తీర ప్రాంతానికి దగ్గర్లో 22 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌లో ఉన్న ఇండోనేషియాలో తరచుగా భూకంపాలు సంభవిస్తాయి.

Last Updated : Feb 9, 2023, 9:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.