Super Blue Moon 2023 In India : ఆకాశంలో మరో అరుదైన దృశ్యం ఆవిష్కృతం కాబోతుంది. చంద్రుడ్ని మనం చాలా దగ్గరగా, మరింత ప్రకాశవంతంగా చూడబోతున్నాం. సాధారణంగా ఇలాంటి సంఘటలను 'సూపర్ మూన్' అంటుంటాం. అయితే ఇప్పుడు వచ్చేది మాత్రం 'సూపర్ బ్లూ మూన్' అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. దాంతో పాటు 'బ్లూ మూన్'ను కూడా చూడొచ్చని వారు అంటున్నారు. బుధవారం రాత్రి ఆకాశంలో ఈ అద్భుతం జరగనుంది.
Super Blue Moon 2023 Date India : 'సూపర్ మూన్' సమయంలో చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చి.. సాధారణ స్థితి కంటే పెద్దదిగానూ, మరింత ప్రకాశవంతంగానూ కనిపిస్తాడు. ఆగస్టు 1న ఆకాశంలో ఈ అరుదైన సంఘటన జరిగింది. అయితే బుధవారం కూడా ఇలాంటి ఘటన మరోసారి జరగబోతుంది. ఇంత తక్కువ సమయంలో రెండు సార్లు భూమికి చంద్రుడు దగ్గరగా వచ్చి.. పెద్దదిగా కనిపించడాన్ని 'బ్లూ మూన్'గా చెబుతున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు.
-
#WATCH | Bihar: A super blue moon lights up the sky; visuals from Patna. pic.twitter.com/Fe9XDrg5g1
— ANI (@ANI) August 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Bihar: A super blue moon lights up the sky; visuals from Patna. pic.twitter.com/Fe9XDrg5g1
— ANI (@ANI) August 30, 2023#WATCH | Bihar: A super blue moon lights up the sky; visuals from Patna. pic.twitter.com/Fe9XDrg5g1
— ANI (@ANI) August 30, 2023
Super Blue Moon 2023 Time India : భారత కాలమానం ప్రకారం.. బుధవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో 'బ్లూ మూన్' కనిపిస్తుంది. గురువారం ఉదయం 7.30 గంటల సమయంలో చంద్రుడు మరింత ప్రకాశవంతంగా ఉంటాడు. దీన్నే 'సూపర్ బ్లూ మూన్'గా చెబుతున్నారు శాస్త్రవేత్తలు. "ఫుల్ మూన్స్లో దాదాపు 25 శాతం.. 'సూపర్ మూన్'లు ఉంటాయి. కానీ 3 శాతం ఫుల్ మూన్లే.. 'బ్లూ మూన్స్'గా ఉంటాయి." అని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. 2037 జనవరి, మార్చిలో "సూపర్ బ్లూ మూన్"లు ఒక జతగా ఏర్పడతాయి." అని న్యూయార్క్ పోస్ట్ ఓ కథనం ప్రచురించింది. అంటే 14 ఏళ్ల తరువాత మరోసారి ఈ అరుదైన ఘటన జరగనుంది.
అయితే 'బ్లూ మూన్' సమయంలో చంద్రుడు రంగులో ఎలాంటి తేడా ఉండదని శాస్త్రవేత్తలు తెలిపారు. సగటున రెండున్నర సంవత్సరాలకు ఒకసారి ఆకాశంలో బ్లూ మూన్ కనిపిస్తుందని నాసా శాస్త్రవేత్తలు వివరించారు. ఇలాంటి సమయంలో సాధారణ స్థితి కంటే చంద్రుడు 14 శాతం ఎక్కువ పెద్దదిగా కనిపిస్తాడని.. 30 శాతం ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటాడని వారు వివరించారు.
Chandrayaan 3 : చంద్రుడిపై ఆక్సిజన్, సల్ఫర్లతో పాటు మరిన్ని మూలకాలు.. వెల్లడించిన ఇస్రో
ISRO Aditya L1 Mission : 'మిషన్ సూర్య' లాంఛ్ రిహార్సల్ సక్సెస్.. నింగిలోకి వెళ్లడమే తరువాయి..