ETV Bharat / international

రియల్ లైఫ్ 'స్క్విడ్ గేమ్​'లో భారతీయుడి సత్తా.. ఎంత గెలుచుకున్నాడో తెలుసా? - తమిళనాడు సెల్వం స్క్విడ్ గేమ్

Singapore squid game : రియల్ లైఫ్​లో జరిగిన స్క్విడ్ గేమ్ తరహా పోటీలో భారతీయుడు విజయం సాధించాడు. తాను పని చేసే కంపెనీ నిర్వహించిన పోటీలో గెలుపొందిన అతడు.. నగదు బహుమతి దక్కించుకున్నాడు. మరి ఆ రియల్ లైఫ్ స్క్విడ్ గేమ్ కథేంటో? విజేత ఎంత గెలిచాడో తెలుసుకుందామా?

singapore squid game
singapore squid game
author img

By

Published : Jun 1, 2023, 2:06 PM IST

Singapore squid game : ఫేమస్ సర్వైవల్ డ్రామా వెబ్​సిరీస్ 'స్క్విడ్ గేమ్' గురించి మీకు తెలుసా? అందులో.. డబ్బు బాగా అవసరం ఉన్న పేద, మధ్యతరగతి వారిని పట్టుకొని ఓ చోట బంధిస్తారు. వారితో కొన్ని గేమ్స్​ ఆడిస్తారు. ప్రతి రౌండ్​కు కొందరిని చొప్పున ఎలిమినేట్ చేస్తారు. ఎలిమినేట్ అంటే గేమ్ నుంచి బయటకు పంపడం కాదు.. ఏకంగా పైకి పంపించడమే. అవును.. గేమ్​లో ఓడిపోయిన వారిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు. గెలిచిన వారికి భారీగా నగదు బహుమతి ఇస్తారు. ఇప్పుడు ఇదంతా ఎందుకని అనుకుంటున్నారా? ఇలాంటి స్క్విడ్ గేమ్ పోటీ నిజంగానే జరిగింది. ఈ గేమ్​లో ఓ భారతీయుడు నగదు బహుమతి గెలుచుకున్నాడు.

సింగపూర్​లో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్న భారత జాతీయుడు సెల్వం అరుముగం(42).. స్క్విడ్ గేమ్​ పోటీలో 18,888 సింగపూర్ డాలర్లను గెలుచుకున్నాడు. 'పొల్లీసమ్ ఇంజినీరింగ్' అనే కంపెనీలో రిగ్గర్, సిగ్నల్​మన్​గా పనిచేస్తున్న అతడు.. ఆ సంస్థ నిర్వహించిన పోటీలో గెలుపొందాడు. సౌత్ కొరియాకు చెందిన 'స్క్విడ్ గేమ్' సిరీస్ స్ఫూర్తితో డిన్నర్-డ్యాన్స్ పోటీలు నిర్వహించింది పొల్లీసమ్ ఇంజినీరింగ్. సిరీస్​​లో చూపించిన విధంగానే పోటీదారులకు గ్రీన్ కలర్ డ్రెస్​లు, నిర్వాహకులకు ఎరుపు రంగు డ్రెస్​లు వేయించింది. ఈ పోటీల్లో గెలుపొందినవారికి మొత్తంగా లక్ష సింగపూర్ డాలర్ల నగదు బహుమతులను అందించింది. అయితే, ఎలిమినేట్ అయినవారికి శిక్షలేమీ వేయలేదు ఈ సంస్థ.

15 మంది బాధ్యత ఒక్కడిపైనే!
పోటీల్లో గెలుపొందిన తమిళనాడుకు చెందిన సెల్వం.. ప్రాథమిక విద్యాభ్యాసం మాత్రమే పూర్తి చేశాడు. అతడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పని కోసం 2007లో సింగపూర్​కు వెళ్లిన సెల్వం.. 2015లో పొల్లీసమ్ కంపెనీలో చేరాడు. అతడి తల్లిదండ్రులు, ఇద్దరు సోదరులు ఇదివరకే ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరి సోదరుల భార్యలు, వారి ఏడుగురు పిల్లల బాధ్యతలను సైతం సెల్వమే చూసుకుంటున్నాడు. మొత్తంగా 15 మందితో కూడిన కుటుంబానికి సెల్వమే ఆధారం. వీరంతా భారత్​లో నివసిస్తున్నారు.

కంపెనీ నిర్వహించిన ఈ వార్షిక డిన్నర్- డ్యాన్స్ కార్యక్రమంలో 210 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. మెకానిక్​లు, డ్రైవర్లు, సేల్స్​ సిబ్బంది వంటి వారంతా ఇందులో భాగమయ్యారు. ఈ పోటీలో రూల్స్​పై సెల్వానికి ఎలాంటి అవగాహన లేదు. అయినప్పటికీ.. అందులో పాల్గొన్నాడు. స్క్విడ్ గేమ్​లో ఉండే గ్రీన్ లైట్- రెడ్​లైట్ గేమ్​ను.. తోటి పోటీదారులను అనుకరిస్తూ పూర్తి చేశాడు. ఎలిమినేషన్ తప్పించుకుంటూ చాకచక్యంగా గేమ్ ఆడాడు. చివరగా విజేతగా నిలిచాడు. వచ్చిన నగదుతో స్వదేశంలో కుటుంబానికి ఇల్లు కట్టిస్తానని సెల్వం చెబుతున్నాడు. తన సోదరుల పిల్లలకు మంచి చదువు చెప్పిస్తానని తెలిపాడు.

"పోటీలో గెలిచిన విషయాన్ని నేను నమ్మలేకపోయా. నా కుటుంబ సభ్యులందరికీ ఫోన్ చేసి ఈ విషయం చెప్పాను. నేనేదో జోక్ చేస్తున్నానని నా భార్య అనుకుంది. నా స్నేహితుడితో మాట్లాడించిన తర్వాతనే విషయాన్ని నమ్మింది. వారు కూడా నా విజయం పట్ల సంతోషంగా ఉన్నారు. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని క్షణం ఇది."
-సెల్వం, స్క్విడ్ గేమ్ పోటీ విజేత

singapore squid game
గెలిచిన తర్వాత మోకాలిపై కూర్చొని నమస్కరిస్తున్న సెల్వం

నగదు బహుమతి స్వీకరించే సమయంలో సెల్వం భావోద్వేగానికి గురయ్యాడు. మోకాళ్లపై నిల్చొని ముఖానికి చేతులు అడ్డుపెట్టుకొని ఆశ్చర్యపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో స్థానికంగా వైరల్ అవుతోంది. కంపెనీ నిర్వాహకులు 18,888 సింగపూర్ డాలర్లను సెల్వానికి.. అందించారు. భారత కరెన్సీలో ఈ మొత్తం సుమారు రూ.11.50 లక్షలు ఉంటుంది. ఇది సెల్వం ఏడాదిన్నర జీతంతో సమానం. రెండేళ్లుగా కంపెనీ బాగా వృద్ధి చెందిందని, అందుకే ఉద్యోగులకు ఏదైనా రివార్డ్ ఇస్తే బాగుంటుందని ఇలా గేమ్ నిర్వహించామని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ క్రిస్ అంగ్ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.