ETV Bharat / international

'జైలుపై ఉక్రెయిన్​ బాంబు దాడి.. 40 మంది మృతి.. అందరూ సొంతవాళ్లే!'​

ఉక్రెయిన్ చేసిన​ బాంబు దాడి వల్ల ఓ జైలులో ఉన్న 40 మంది ఉక్రెయిన్ సైనికులు మరణించారని రష్యా మద్దతు గల వేర్పాటువాదుల ప్రతినిధి తెలిపారు. ఆ ఘటనలో 130 మంది గాయపడ్డారని కూడా చెప్పారు.

Separatists say shelling killed Ukrainian prisoners of war

author img

By

Published : Jul 29, 2022, 1:33 PM IST

Updated : Jul 29, 2022, 2:02 PM IST

ఉక్రెయిన్​పై గత కొన్ని నెలలుగా రష్యా.. దండయాత్ర చేస్తూనే ఉంది. ఈ క్రమంలో రష్యా మద్దతు గల వేర్పాటువాదుల ప్రతినిధి కీలక విషయాన్ని వెల్లడించారు. మరియుపోల్​ ప్రాంతంలో జరిగిన యుద్దం తర్వాత అరెస్టైన ఉక్రెయిన్​ సైనికుల్లో 40 మంది మరణించారని, 130 మంది గాయపడ్డారని తెలియజేశారు. అయితే వీరంతా ఉక్రెయిన్​ చేసిన బాంబు దాడి వల్లే చనిపోయారని చెప్పారు.
ఒలెనివ్కా పట్టణంలోని జైలుపై షెల్లింగ్​ జరిపినట్లు వెల్లడించారు డొనెట్స్క్​లోని వేర్పాటువాదుల ప్రతినిధి డానిల్​ బెసొనోవ్​. దీనిపై ఉక్రెయిన్​ అధికారుల నుంచి ఎలాంటి ప్రతిస్పందన లేదు.

యుద్ధసమయంలో.. అజోవ్ ఓడరేవు, స్టీల్​ మిల్​కు రక్షణగా ఉన్న ఉక్రెయిన్​ సైనికులు దాదాపు 3 నెలల అనంతరం రష్యాకు లొంగిపోయారు. అప్పటినుంచి వీరిని రష్యా మద్దతున్న డొనెట్స్క్​ వంటి ప్రాంతాల్లోని జైళ్లలో బంధించారు. ఇప్పుడు ఉక్రెయిన్​ బాంబు దాడిలో ఆ దేశానికే చెందిన 40 మంది చనిపోయినట్లు తెలుస్తోంది.

Last Updated : Jul 29, 2022, 2:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.