ETV Bharat / international

టెస్లా ఇంజినీర్​పై రోబో దాడి- బలంగా పట్టుకొని శరీరంపై గాయాలు చేసిన 'చిట్టి'! - ఇంజినీర్​ టెస్లారోబో దాడి

Robot Attacks Engineer : సినిమా తరహాలో ప్రోగ్రామింగ్ చేసే ఇంజినీర్​పైనే దాడి చేసింది ఓ రోబో. ఈ ఘటన దిగ్గజ కార్ల తయారీ సంస్థ టెస్లాలో రెండేళ్ల క్రితం జరగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Robot Attacks Engineer
Robot Attacks Engineer
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 28, 2023, 5:07 PM IST

Robot Attacks Engineer : దిగ్గజ కార్ల తయారీ సంస్థ టెస్లా ఫ్యాక్టరీలో ఓ ఇంజినీర్​పై రోబో దాడి చేసింది. కార్ల తయారీలో సహాయ పడేందుకు రూపొందించిన రోబో- ఇంజినీర్​పైనే దాడి చేసింది. సాంకేతిక లోపాల వల్ల ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇంజినీర్​కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆస్టిన్​లోని గిగా టెక్సాస్​ ఫ్యాక్టరీలో రెండేళ్ల క్రితం జరగగా ఆలస్యంగా తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఇదీ జరిగింది
గిగా టెక్సాస్​ కార్ల ఉత్పత్తి పరిశ్రమలో అల్యూమినియం భాగాలను బిగించేందుకు రోబోను వినియోగిస్తున్నారు. అయితే, ఈ రోబోలో లోపం తలెత్తింది. దీంతో తనకు ప్రోగ్రామింగ్ చేసే సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​పైనే దాడి చేసింది. పరిశ్రమలో ఉన్న మూడు రోబోలను ఆఫ్​ చేస్తుండగా ఒకటి ఇంజినీర్​పైనే దాడి చేసింది. ఇంజినీర్​ను బలంగా పట్టుకుని, అతడి వీపు, చేతులపై దాడి చేసింది. రోబో నుంచి తప్పించుకున్న ఇంజినీర్​ ప్రమాదవశాత్తు పక్కన ఉన్న అల్యూమినియం భాగాలను కోసే యంత్రంలో పడిపోయాడు. తీవ్ర రక్తస్రావమైన ఇంజినీర్​ను తోటి ఉద్యోగులు గమనించి ఆస్పత్రికి తరలించారు.

తాజాగా విడుదలైన నివేదికతో ఈ విషయం బయటపడింది. దీని ప్రకారం గతేడాదిలో సగటున ప్రతి 21 మందిలో ఒకరు గాయపడినట్లు తేలింది. ఇది ఇతర పరిశ్రమల సగటు కన్నా చాలా ఎక్కువ అని నివేదిక పేర్కొంది. 2022లో కూడా పరిశ్రమలో భారీ పేలుడు జరిగిందని తెలిపింది. అయితే, ఈ ఘటనపై స్పందించేందుకు టెస్లా సంస్థ నిరాకరించింది. సంస్థలో ఉద్యోగ భద్రతపై తరచూ విమర్శలు వస్తూనే ఉంటాయి. ఉద్యోగులకు సరైన రక్షణ కల్పించకుండా నిర్మాణ, నిర్వహణ, ఆపరేషన్స్​ రంగాల్లో పనులు చేయిస్తుంటారని టెస్లాపై అనేక ఆరోపణలు ఉన్నాయి.

చెస్​ ఆడుతుండగా రోబో 'పైశాచికం'- పిల్లాడి వేలు విరిచేసిన చిట్టి!
Robot Chess finger break : అంతకుముందు రష్యాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఏడేళ్ల బాలుడితో చెస్​ ఆడుతున్న ఓ రోబో, ఒక్కసారిగా ఆ పిల్లాడి వేలు విరిచేసింది. ఈ హఠాత్ పరిణామంతో అక్కడున్న వారు కంగుతిన్నారు. నలుగురు పెద్దలు కలిసి చాలాసేపు శ్రమించి, రోబో నుంచి బాలుడ్ని రక్షించారు. అతడ్ని హుటాహుటిన అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Manhole Cleaning Robot : మ్యాన్‌హోల్స్‌ క్లీన్​ చేస్తున్న 'రోబో'.. 360 డిగ్రీల్లో.. చిన్నమరక కూడా లేకుండా..

PM Modi At Robot Gallery : రోబో గ్యాలరీలో మోదీ.. టీ తెచ్చి పెట్టిన 'చిట్టి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.