ETV Bharat / international

భారత్​ ఆటోలతో నేరాలకు చెక్​.. బ్రిటన్​ పోలీసుల వినూత్న నిర్ణయం

బ్రిటన్‌ పోలీసులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. రవాణా సాధనంగా వినియోగించే ఆటోల సాయంతో.. నేరాల నియంత్రణకు సిద్ధమయ్యారు. అయితే భారత్‌కు చెందిన ఆటో దిగ్గజం 'మహీంద్రా ఎలక్ట్రిక్‌' ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం విశేషం.

police in britain planning to use autos to fight crime

author img

By

Published : Oct 19, 2022, 7:57 AM IST

Britian Indian Autos: ప్రపంచవ్యాప్తంగా పోలీసు విభాగాలు అధునాతన హై స్పీడ్‌ వాహనాలను సమకూర్చుకుంటున్న వేళ.. బ్రిటన్‌ పోలీసులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా రవాణా సాధనంగా వినియోగించే ఆటోల సాయంతో.. నేరాల నియంత్రణకు సిద్ధమయ్యారు. ఇక్కడి గ్వెంట్‌ పోలీసులు ఇప్పటికే నాలుగు ఆటోలను తమ వాహన జాబితాలో చేర్చారు. ఇదిలా ఉండగా.. భారత్‌కు చెందిన ఆటో దిగ్గజం 'మహీంద్రా ఎలక్ట్రిక్‌' ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం విశేషం.

పార్కులు, నడక మార్గాలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో పెట్రోలింగ్‌కు ఈ ఎలక్ట్రిక్‌ ఆటోలను వినియోగించనున్నట్లు స్థానిక పోలీసు అధికారులు తెలిపారు. 'ఈ ఆటోల వద్ద పౌరులు తమ ఫిర్యాదులను నమోదు చేయొచ్చు. పోలీసు సంబంధిత సేవలు లభిస్తాయి. నేరాల నివారణకు సలహాలనూ అందించొచ్చు' అని వివరించారు. 'సేఫ్ స్ట్రీట్స్ ప్రోగ్రామ్‌'లో భాగంగా ఈ ఆటోలను ప్రవేశపెడుతున్నారు. నేరాల నియంత్రణ, అసాంఘిక శక్తుల కట్టడి, మహిళల భద్రత విషయంలో ఇది తోడ్పడుతుంది.

గ్వెంట్ పోలీస్ చీఫ్ డామియన్ సౌరే.. ఈ వాహనాలను ఇటీవల ఓ ఈవెంట్‌లో ప్రదర్శించారు. ఈ ఆటోలతో గస్తీ విషయంలో స్థానికుల నుంచి ఫీడ్‌బ్యాక్ కూడా సానుకూలంగా ఉందని తెలిపారు. ఇటువంటి గొప్ప కార్యక్రమంలో భాగమైనందుకు గర్విస్తున్నట్లు 'మహీంద్రా ఎలక్ట్రిక్' ఓ ట్వీట్‌ చేసింది. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సైతం.. ఈ ఆటోలకు సంబంధించిన ఓ వార్తా కథనంపై ట్విట్టర్​లో స్పందిస్తూ.. ఈ లోగో సుపరిచితంగా కనిపిస్తోందని క్యాప్షన్ ఇచ్చారు.

  • Autos have been used as public transportation but Gwent police has different plans for them. They want e-autos to be used as "safe spaces" where crimes can be reported, help sought, and crime prevention advice can be given.
    We're proud to be a part of such a noble initiative. pic.twitter.com/GLQftxjU7K

    — Mahindra Electric (@MahindraElctrc) October 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి: విద్యుత్‌ కేంద్రాలే రష్యా టార్గెట్‌.. లక్షల మంది ఉక్రెయిన్‌ ప్రజలు అంధకారంలోనే

చైనా పైలట్లుకు బ్రిటన్​ మాజీల శిక్షణ! భారీ ప్యాకేజీలు ఇస్తున్న డ్రాగన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.