ETV Bharat / international

'యుద్ధాన్ని త్వరగా ముగించాలి'- నెతన్యాహుకు ప్రధాని మోదీ సూచన

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 20, 2023, 6:56 AM IST

PM Modi Netanyahu Israel Hamas War : ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య జరుగుతున్న యుద్ధానికి అతి త్వరగా శాంతియుత మార్గంలో ముగింపు పలకాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. గాజా ప్రజలకు సాయం అందాలని ఆకాంక్షించారు. ఈ మేరకు మంగళవారం ఇజ్రాయెల్​ ప్రధాని నెతన్యాహు ప్రధాని మోదీకి ఫోన్​ చేశారు.

PM Modi Netanyahu Israel Hamas War
PM Modi Netanyahu Israel Hamas War

PM Modi Netanyahu Israel Hamas War : ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య జరుగుతున్న యుద్ధానికి అతి త్వరగా శాంతియుత మార్గంలో ముగింపు పలకాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. బందీలను దౌత్యపరమైన చర్చల ద్వారా విడిపించుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. గాజా ప్రజలకు మరింతగా మానవతా సాయం అందాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ప్రధాని మోదీకి మంగళవారం ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు ఫోన్‌ చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరు దేశాల ప్రధానుల మధ్య చర్చలు జరిగాయి. ఇటీవల జరిగిన పరిణామాల గురించి నెతన్యాహు మోదీకి వివరించారు. చర్చలు ఫలప్రదంగా సాగాయని ఆ తర్వాత మోదీ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో వెల్లడించారు.

  • Had a productive exchange of views with PM @netanyahu on the ongoing Israel-Hamas conflict, including shared concerns on the safety of maritime traffic. Highlighted India’s consistent stand in favour of early restoration of peace & stability in the region with continued…

    — Narendra Modi (@narendramodi) December 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అయితే ఎర్ర సముద్రంలో సరకు రవాణా నౌకలపై జరగుతున్న దాడులపట్ల ఇరువురు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. బాబ్‌ ఎల్‌- మండెప్‌ ప్రాంతంలో ఆ నౌకలకు రక్షణ కల్పించే చర్యల దిశగా వారి చర్చలు సాగాయి. ఇరాన్‌ మద్దతుతో హౌతీ రెబల్స్‌ దాడులు చేయడం గురించి ఇరు దేశాల నేతలు మాట్లాడుకున్నారని ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. 'ఇరువురు నేతలు సరకు రవాణా నౌకల ప్రయాణం సాఫీగా సాగాల్సిన అవసరాన్ని గురించి చర్చించారు. హౌతీ దాడుల కారణంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొనే ఇబ్బందులపై చర్చలు జరిపారు. ఇండియా, ఇజ్రాయెల్‌ ఆర్థిక సంబంధాలపై పడే ప్రభావం గురించి కూడా మాట్లాడారు' అని ప్రధాని కార్యాలయం వివరించింది. ఇజ్రాయెల్‌కు అత్యవసరంగా కావాల్సిన కార్మికుల అంశం ఇరువురు నేతల మధ్య చర్చకు వచ్చింది. ఇలాగే పలు అంశాలపై తరచూ మాట్లాడుకుందామని ఇద్దరు నేతలు నిర్ణయించుకున్నారు.

  • Prime Minister Benjamin Netanyahu spoke today with Indian Prime Minister @NarendraModi.

    The two leaders discussed the importance of securing freedom of navigation in the Bab-el-Mandeb, which is threatened by the aggression of the Houthis, instigated by Iran

    — Prime Minister of Israel (@IsraeliPM) December 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అమెరికాకు షాక్- దూరం పెట్టి ఐరాస!
గాజా ప్రజలకు మానవతా సాయాన్ని అందించేందుకు వీలుగా కాల్పుల విరమణ పాటించేలా మరోసారి ఐక్యరాజ్య సమితి ఓటింగ్‌ నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బ్రిటిష్‌ సీక్రెట్‌ ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌ మాజీ చీఫ్‌ జాన్‌ సాయర్స్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాను ఈసారి ఓటింగ్‌కు దూరంగా ఉంచాలనే ముసాయిదాను రూపొందించేందుకు దౌత్యవేత్తలు యోచిస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల తీర్మానం ఆమోదం పొందే అవకాశం ఉందని చెప్పారు. ఇంతకు ముందు కాల్పుల విరమణ కోసం ఐక్యరాజ్య సమితి ఓటింగ్‌ నిర్వహించింది. కానీ వీటో పవర్​తో ఆమోదం పొందకుండా అమెరికా అడ్డుకుంది.

Western Countries Supporting Israel : ఇజ్రాయెల్​కు అండగా పశ్చిమ దేశాలు.. మోదీకి ప్రధాని నెతన్యాహు ఫోన్​కాల్​

యుద్ధం తర్వాత గాజాను పాలించేదెవరు? కాల్పుల విరమణకు నెతన్యాహూ నో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.