ETV Bharat / international

పాక్​ మంత్రిని కిడ్నాప్‌ చేసిన ఉగ్రవాదులు.. ఒక రోజు తర్వాత..

పాక్​ సీనియర్​ మంత్రి అబైదుల్లా బైగ్‌ను ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేశారు. మంత్రితోపాటు మరో ఇద్దరిని తీవ్రవాదులు శుక్రవారం ఎత్తుకెళ్లగా.. అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినట్లు సమాచారం.. అయితే, డిమాండ్లను అంగీకరించడం వల్ల ఆ ముగ్గురిని ఉగ్రవాదులు శనివారం విడుదల చేసినట్లు అక్కడి మీడియా వెల్లడించింది.

paksithan minister kidnapped
paksithan minister kidnapped
author img

By

Published : Oct 9, 2022, 6:59 AM IST

Pakisthan Minister Kidnapped: పాకిస్థాన్‌కు చెందిన సీనియర్‌ మంత్రి అబైదుల్లా బైగ్‌ను ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేశారు. మంత్రితోపాటు మరో ఇద్దరిని తీవ్రవాదులు శుక్రవారం ఎత్తుకెళ్లగా.. అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. అయితే, డిమాండ్లను అంగీకరించడంతో ఆ ముగ్గురిని ఉగ్రవాదులు శనివారం విడుదల చేసినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి అబైదుల్లా మంత్రిగా ఉన్నారు. కాగా, ఉత్తర పాకిస్థాన్‌లోని గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రాంతంలో మంత్రితోపాటు ఇద్దరు పర్యాటకులను తెహ్రీక్-ఇ-తాలిబాన్ చెందిన తీవ్రవాదులు శుక్రవారం మధ్యాహ్నం అపహరించారు.

జైల్లో ఉన్న తమ గ్రూప్‌ సభ్యులను విడిచిపెట్టాలని ఉగ్రవాదులు డిమాండ్‌ చేశారు. ఇందుకు సంబంధించి వీడియోలు కూడా విడుదల చేశారు. కాగా, అధికారులు ఆ డిమాండ్లకు అంగీకరించినట్లు తెలుస్తోంది. చర్చలు సఫలమై, డిమాండ్లకు ఒప్పుకోవడంతో బంధీలుగా ఉన్న ఆ ముగ్గురిని ఉగ్రవాదులు శనివారం విడిచిపెట్టినట్లు అక్కడి వార్తాసంస్థలు పేర్కొన్నాయి.

నంగా పర్బత్‌, దియామేర్‌ ప్రాంతాల్లో విదేశీయులను ఊచకోత కోసిన ఉగ్రవాదులు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. వారిని విడుదల చేయాలని హెహ్రీక్‌-ఇ-తాలిబన్‌ కమాండర్‌, మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో ఉన్న హబీబుర్‌ రహమాన్‌ డిమాండ్‌ చేస్తున్న ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మహిళా క్రీడా కార్యకలాపాలు లేకుండా చట్టాలు రూపొందించాలని కూడా అందులో డిమాండ్‌ చేశారు.

ఇవీ చదవండి: రష్యా-క్రిమియా రైలు వంతెనపై భారీ పేలుడు.. ఎగసిపడిన మంటలు.. ముగ్గురు మృతి

'రష్యా నుంచి చమురు కొనొద్దని భారత్‌కు ఎవరూ చెప్పలేదు.. అవసరమైతే ఎక్కడైనా కొంటాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.