Pakistan Vs Iran War : బలూచిస్థాన్‌లో ఇరాన్ చేసిన దాడులకు పాకిస్థాన్ ప్రతీకార చర్యలు చేపట్టింది. ఇరాన్‌లోని వేర్పాటువాదుల స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ఏడుగురు చనిపోయారు. ఇరాన్ భూభాగంలో తలదాచుకుంటున్న బలూచిస్థాన్ వేర్పాటువాద క్యాంపులపై తమ దేశ వైమానిక దళం దాడులు చేసినట్లు పాక్ విదేశాంగ శాఖ ప్రకటించింది. పాకిస్థాన్‌లో వాంటెడ్‌గా ఉన్న మిలిటెంట్లే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు తెలిపింది. ఈ దాడుల్లో పలువురు ఉగ్రవాదులు హతమయ్యారని వెల్లడించింది. ఈ నిఘా ఆపరేషన్‌కు 'మార్గ్ బర్ సర్మాచార్' అని నామకరణం చేసినట్లు పాక్ విదేశాంగ శాఖ తన ప్రకటనలో తెలిపింది.
-
🔊: PR NO. 1️⃣7️⃣/2️⃣0️⃣2️⃣4️⃣
— Spokesperson 🇵🇰 MoFA (@ForeignOfficePk) January 18, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
Operation Marg Bar Sarmachar
🔗⬇️ https://t.co/1n5BvtEZBZ pic.twitter.com/VVf5VwL00L
">🔊: PR NO. 1️⃣7️⃣/2️⃣0️⃣2️⃣4️⃣
— Spokesperson 🇵🇰 MoFA (@ForeignOfficePk) January 18, 2024
Operation Marg Bar Sarmachar
🔗⬇️ https://t.co/1n5BvtEZBZ pic.twitter.com/VVf5VwL00L🔊: PR NO. 1️⃣7️⃣/2️⃣0️⃣2️⃣4️⃣
— Spokesperson 🇵🇰 MoFA (@ForeignOfficePk) January 18, 2024
Operation Marg Bar Sarmachar
🔗⬇️ https://t.co/1n5BvtEZBZ pic.twitter.com/VVf5VwL00L
"ఇరాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉగ్రవాదులు ఆశ్రయం పొందుతున్న విషయంపై ఆ దేశంతో జరిగిన చర్చల్లో పాకిస్థాన్ గత కొన్నేళ్లుగా ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చింది. తమను తాము సర్మాచార్లుగా అభివర్ణించుకునే ఆ ఉగ్రవాదుల జాడపై కచ్చితమైన సమాచారాన్ని ఇరాన్‌కు పాక్ అందించింది. కానీ, మా ఆందోళనలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ సర్మాచార్లు అమాయకులైన పాకిస్థాన్ ప్రజలపై దాడి చేసి రక్తపాతం సృష్టించారు. సర్మాచార్లు పెద్ద ఎత్తున ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న సమాచారంతో ఈ (గురువారం) ఉదయం చర్యలు తీసుకున్నాం. దేశ భద్రతను కాపాడేందుకు ఈ దాడులు నిర్వహించాం."
-పాకిస్థాన్ విదేశాంగ శాఖ
ఏడుగురు మృతి
ఈ దాడుల్లో నలుగురు చిన్నారులు, ముగ్గురు మహిళలు చనిపోయారని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ వెల్లడించింది. 'గురువారం ఉదయం 4.50 గంటలకు సీస్టాన్ బలూచిస్థాన్ రాష్ట్రంలోని సరవన్ నగరం సమీపంలో పేలుళ్ల శబ్దం వినిపించింది. ప్రాథమిక విచారణ తర్వాత ఇవి పాక్ చేసిన దాడులు అని తెలిసింది. సరిహద్దులోని ఓ గ్రామాన్ని లక్ష్యంగా చేసుకొని క్షిపణితో దాడి చేసినట్లు మేం గుర్తించాం' అని ఇరాన్‌కు చెందిన సీనియర్ అధికారి అలీరెజా మర్హామాటి పేర్కొన్నారు.
24 గంటల్లోనే ప్రతీకారం
పాక్‌లోని జైష్ అల్ అదిల్ (ఆర్మీ ఆఫ్ జస్టిస్)కు చెందిన రెండు కీలక స్థావరాలపై దాడులు చేసినట్లు ఇరాన్ ప్రకటించిన 24 గంటల్లోనే ఈ మేరకు ప్రతీకార చర్యలు తీసుకుంది. ఇరాన్ దాడులు తమ సార్వభౌమత్వానికి విఘాతం కలిగించాయని, ఇందుకు తీవ్ర పరిణామాలు తప్పవని పాక్ బుధవారం హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే దాడులు జరిగినట్లు పాకిస్థాన్ స్థానిక వార్తాపత్రిక ఎడిటర్, న్యూయార్క్ టైమ్స్ కరస్పాండెంట్ సల్మాన్ మసూద్ వెల్లడించారు. బలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్, బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ స్థావరాలపై దాడులు జరిగాయని చెప్పారు.
-
Breaking —- Pakistan Air Force has conducted airstrikes on Baluch separatist camps inside Iran. The move comes a day after Iran claimed to have targeted militants inside Pakistani territory, a claim rejected by Pakistan, citing civilian casualties.
— Salman Masood (@salmanmasood) January 18, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">Breaking —- Pakistan Air Force has conducted airstrikes on Baluch separatist camps inside Iran. The move comes a day after Iran claimed to have targeted militants inside Pakistani territory, a claim rejected by Pakistan, citing civilian casualties.
— Salman Masood (@salmanmasood) January 18, 2024Breaking —- Pakistan Air Force has conducted airstrikes on Baluch separatist camps inside Iran. The move comes a day after Iran claimed to have targeted militants inside Pakistani territory, a claim rejected by Pakistan, citing civilian casualties.
— Salman Masood (@salmanmasood) January 18, 2024
జనవరి 16 నాటి ఇరాన్ దాడుల నేపథ్యంలో ఆ దేశ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్ అబ్దొల్లహియాన్తో పాక్ ఆపద్ధర్మ విదేశాంగ మంత్రి జలీల్ అబ్బాస్ జిలానీ బుధవారం ఫోన్లో మాట్లాడారు. ఇరాన్ దాడులతో అంతర్జాతీయ చట్టాలు ఉల్లంఘనకు గురయ్యాయని అన్నారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలకు ఈ దాడులు తీవ్ర విఘాతం కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే, పాక్ ఆపద్ధర్మ ప్రధాని అన్వరుల్ హక్ కాకర్- ఇరాన్ విదేశాంగ మంత్రితో దావోస్‌లో భేటీ అయిన సమయంలోనే దాడులు జరగడం గమనార్హం.
భారత్ స్పందన ఇదే
పాక్‌పై ఇరాన్ దాడుల అంశంపై భారత్ సున్నితంగా స్పందించింది. ఆత్మరక్షణ కోసం చేపట్టే చర్యలను తాము అర్థం చేసుకుంటామని బుధవారం పేర్కొంది. ఈ ఉద్రిక్తతల అంశం పాక్, ఇరాన్ దేశాల ద్వైపాక్షిక అంశమని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జయస్వాల్ తెలిపారు. ఉగ్రవాదం విషయంలో మాత్రం రాజీ ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
వెనక్కి తగ్గని హౌతీలు- అమెరికా నౌకపైకి క్షిపణి ప్రయోగం- ఇరాన్ బాంబుల వర్షం!
కిమ్ కటీఫ్- దక్షిణ కొరియాతో మాటలు బంద్- త్వరలో రాజ్యాంగ సవరణ!