ETV Bharat / international

ఇమ్రాన్​ ఖాన్​పై అనర్హత వేటు- పార్లమెంటుకు ఐదేళ్లు దూరం - ఇమ్రాన్​ ఖాన్​ తోషాఖానా కేసు

పాకిస్థాన్​ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్​ ఖాన్​కు రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆస్తుల వివరాల్ని దాచి పెట్టిన కేసులో ఆయనపై ఆ దేశ ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. ఫలితంగా ఐదేళ్లపాటు ఆయన పార్లమెంటు సభ్యుడు అయ్యేందుకు వీలు లేకుండా పోయింది.

imran khan disqualified
ఇమ్రాన్ ఖాన్
author img

By

Published : Oct 21, 2022, 2:55 PM IST

Updated : Oct 21, 2022, 3:45 PM IST

పాకిస్థాన్​ మాజీ ప్రధాన మంత్రి, ప్రతిపక్ష పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్​ ఖాన్​(70)కు రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై ఆ దేశ ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. కానుకల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయం వివరాల్ని దాచిపెట్టిన కేసులో ఈమేరకు చర్యలు తీసుకుంది. ఫలితంగా ఇమ్రాన్​ ఖాన్​ ఐదేళ్లపాటు పార్లమెంటు సభ్యుడు అయ్యేందుకు వీలు లేకుండా పోయింది.

ప్రధాన మంత్రిగా ఉండగా వేర్వేరు దేశాల అధినేతలు, ప్రతినిధులు ఇచ్చిన కానుకల్ని.. పాకిస్థాన్​ ప్రభుత్వం ఆధ్వర్యంలోని 'తోషాఖానా' నుంచి తక్కువ ధరకు ఇమ్రాన్ ఖాన్​ కొనుగోలు చేశారు. అయితే.. వాటిని విక్రయించడం ద్వారా ఎంత ఆదాయం వచ్చిందనే వివరాల్ని ఆయన బయటపెట్టలేదని ఆరోపిస్తూ ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన చట్టసభ్యులు కొందరు పాకిస్థాన్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇమ్రాన్​ ఖాన్​ను అనర్హునిగా ప్రకటించాలని కోరారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీ.. ఈ వ్యవహారంపై విచారణ జరిపింది.

గ్రాఫ్​ చేతి గడియారం, కఫ్​లింక్స్​, ఖరీదైన పెన్, ఉంగరం, నాలుగు రోలెక్స్ వాచ్​లు సహా మరికొన్ని కానుకల్ని మొత్తం రూ.2కోట్ల 15 లక్షల 60వేలకు తోషాఖానా నుంచి కొనుగోలు చేసినట్లు పాక్ ఎన్నికల సంఘానికి విచారణ సమయంలో తెలిపారు ఇమ్రాన్. వాటిని విక్రయిస్తే రూ.5కోట్ల 80లక్షలు వచ్చినట్లు వెల్లడించారు. అయితే.. ఈ ఆదాయం వివరాల్ని ఇన్​కమ్ ట్యాక్స్​ రిటర్నుల్లో చూపలేదు. ఫలితంగా.. ఇమ్రాన్​ ఖాన్​పై ఈసీ అనర్హత వేటు వేసింది. అవినీతి నిరోధక చట్టాల కింద కూడా ఆయనపై చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.

పాకిస్థాన్​ తెహ్రీక్​-ఎ-ఇన్సాఫ్​(పీటీఐ) పార్టీకి నేతృత్వం వహిస్తున్న ఇమ్రాన్‌ ఖాన్‌ 2018లో అధికారం చేపట్టి.. ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు ప్రధానిగా కొనసాగారు. ఆ తర్వాత చట్టసభలో మద్దతు కోల్పోవడం వల్ల రాజీనామా చేశారు. అమెరికా కుట్ర కారణంగానే తాను పదవి పోగొట్టుకొన్నానని అప్పట్లో ఆయన ఆరోపించారు.

Last Updated : Oct 21, 2022, 3:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.