ETV Bharat / international

కిమ్ దూకుడు.. మూడు నెలల తర్వాత క్షిపణి ప్రయోగం.. అమెరికాకు హెచ్చరిక!

జపాన్ తూర్పు సముద్ర జలాల్లోకి బాలిస్టిక్​ క్షిపణిని ప్రయోగించింది ఉత్తర కొరియా. మూడు నెలల తర్వాత ఓ ఖండాంతర క్షిపణిని పరీక్షించింది.

north korea missile attack
ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం
author img

By

Published : Jul 12, 2023, 10:59 AM IST

Updated : Jul 12, 2023, 12:48 PM IST

కొరియా ద్వీపకల్పం మళ్లీ ఉద్రిక్తంగా మారింది. 3నెలల తర్వాత తొలిసారి ఉత్తర కొరియా ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి పరీక్ష నిర్వహించింది. ఈ విషయాన్ని జపాన్‌, దక్షిణ కొరియా అధికారులు ధ్రువీకరించారు. ఈ ఖండాంతర క్షిపణి తూర్పుదిశగా కొంతసేపు పయనించి జపాన్‌ సముద్ర జలాల్లో పడినట్లు తెలిపారు. రాజధాని ప్యాంగ్‌యాంగ్‌ ప్రాంతం నుంచి ఉదయం 10 గంటలకు ఈ ప్రయోగం చేపట్టినట్లు తెలుస్తోంది.

ఉత్తర కొరియా అధినేత కిమ్‌ సోదరి యో జోంగ్‌ అమెరికాను హెచ్చరించిన రెండురోజుల తర్వాత ఈ పరీక్ష చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. యో జోంగ్‌ మంగళవారం అమెరికాపై నిప్పులు చెరిగారు. అమెరికా గూఢచారి విమానాలు ఉత్తర కొరియా గగనతలంలోకి ప్రవేశించాయని ఆమె ఆరోపించారు. వాషింగ్టన్‌కు చెందిన నిఘా విమానాలు మళ్లీ తమ భూభాగంలోకి చొరబడితే కూల్చేస్తామని హెచ్చరించారు. కాగా మరోవైపు దక్షిణ కొరియా, అమెరికా, జపాన్‌ దేశాలు.. ప్యాంగ్​యాంగ్‌ దూకుడును తట్టుకొనేందుకు సంయుక్త యుద్ధ విన్యాసాలను ముమ్మరం చేశాయి.

ఉత్తర కొరియా తమపై చేసిన ఆరోపణలను అమెరికా కొట్టిపారేసింది. దేశ సైనిక కార్యకలాపాలు తమ సరిహద్దుల్లోనే జరుగుతున్నాయని స్పష్టం చేసింది. ఎప్పటిలాగే.. బాధ్యతాయుతంగా, అంతర్జాతీయ నిబంధనలకు లోబడి, తమ మిత్రదేశాలతో కలిసి పనిచేయడానికి అమెరికా కట్టుబడి ఉంటుందని పెంటగాన్ డిప్యూటి ప్రెస్ సెక్రటరీ సబ్రినా సింగ్ తెలిపారు. ఉత్తరకొరియా నుంచి వస్తున్న బెదిరింపులు, కామెంట్లు తాము పట్టించుకోబోమని సబ్రినా అన్నారు.

కాగా 2022 ప్రారంభం నుంచి 100 పైగా క్షిపణి ప్రయోగాలను ఉత్తర కొరియా నిర్వహించింది. ఇదే సంవత్సరం ఉత్తర కొరియా.. ఓ గూఢచారి ఉపగ్రహ ప్రయోగం చేసి విఫలం అయ్యింది. అమెరికా ప్రధాన భూభాగాన్ని చేరే శక్తి ఉన్న ఐసీబీఎంలను కూడా ఉత్తర కొరియా అభివృద్ధి చేస్తోంది.

కొత్త సంవత్సరానికి వినూత్న ఆహ్వానం..
నూతన సంవత్సరాన్ని సైతం క్షిపణి పరీక్షలతోనే ప్రారంభించి తన దుందుడుకు స్వభావం ప్రదర్శించిన ఘనత కిమ్​కు సొంతం. 2022లో రికార్డు స్థాయిలో ఆయుధ ప్రయోగ పరీక్షలు నిర్వహించిన ఉత్తర కొరియా.. ఈ ఏడాది కూడా ఆయుధ పరీక్షలు భారీ ఎత్తునే ఉంటాయని పరోక్షంగా సంకేతాలిచ్చింది. కొత్త సంవత్సరం సందర్భంగా జనవరిలో అధికార పార్టీ సమావేశంలో మాట్లాడిన కిమ్‌.. అణ్వస్త్రాల తయారీని గణనీయంగా పెంచుతామని ప్రతిజ్ఞ చేశారు. మరింత శక్తిమంతమైన ఖండాంతర క్షిపణులను తయారు చేస్తామని ప్రకటించారు. అమెరికా సహా ఇతర ప్రత్యర్థి దేశాలను ఎదుర్కొనేందుకు సైనిక శక్తిని మరింత పటిష్ఠ పరుస్తామన్నారు. దేశ సార్వభౌమత్వాన్ని, భద్రతను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కథనాన్ని పూర్తిగా చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Last Updated : Jul 12, 2023, 12:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.