ETV Bharat / international

కొరియాలోకి అమెరికా 'అణు' సబ్​మెరైన్.. మిసైల్స్​ ప్రయోగించి కిమ్ హెచ్చరిక - north korea missile range

North Korea missile : ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి రెచ్చిపోయారు. అమెరికాకు హెచ్చరికగా రెండు స్వల్ప శ్రేణి క్షిపణులను ప్రయోగించారు.

North Korea missile
North Korea missile
author img

By

Published : Jul 19, 2023, 7:21 AM IST

Updated : Jul 19, 2023, 9:39 AM IST

North Korea missile : నియంతృత్వ కిమ్ జోంగ్ ఉన్ నాయకత్వంలోని ఉత్తర కొరియా మరోసారి క్షిపణి ప్రయోగం చేసింది. అమెరికాకు హెచ్చరికగా రెండు స్వల్పశ్రేణి క్షిపణులను ప్రయోగించింది. అణ్వాయుధ సామర్థ్యం కలిగిన సబ్​మెరైన్​ను దక్షిణ కొరియాకు అమెరికా తరలించిన నేపథ్యంలో హెచ్చరికగా కిమ్ ఈ క్షిపణి ప్రయోగాలు చేసినట్లు తెలుస్తోంది. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్​యాంగ్​కు సమీపంలోని ఓ ప్రాంతం నుంచి ఈ క్షిపణులు దూసుకొచ్చాయని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కార్యాలయం తెలిపింది. తెల్లవారుజామున 3.30 నుంచి 3.46 గంటల మధ్య క్షిపణులు ప్రయోగించారని తెలిపింది. మిసైళ్లు 550 కిలోమీటర్లు ప్రయాణించి కొరియా ద్వీపకల్పానికి తూర్పున సముద్ర జలాల్లో పడిపోయాయని వెల్లడించింది.

North Korea news: జపాన్ సైన్యం సైతం ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలను నిర్ధరించింది. జపాన్ అధీనంలోని సముద్ర జలాలకు అవతల క్షిపణులు పడిపోయాయని తెలిపింది. ప్రస్తుతానికైతే దీని వల్ల సముద్రంలోని నౌకలకు నష్టం జరగలేదని వివరించింది. గగనతలంలో విమానాల రాకపోకలకు సైతం ఇబ్బంది లేదని స్పష్టం చేసింది. దశాబ్దాల తర్వాత అమెరికా తన అణ్వాయుధ సబ్​మెరైన్​ను దక్షిణ కొరియాకు తీసుకొచ్చింది. చివరిసారిగా 1980లలో అమెరికాకు చెందిన ఓ న్యూక్లియర్ సబ్​మెరైన్.. దక్షిణ కొరియాకు వచ్చింది.

North Korea Missile Japan : ఉత్తర కొరియా క్షిపణులు ప్రయాణించిన దూరం.. ప్యాంగ్​యాంగ్​ నుంచి దక్షిణ కొరియాలోని బూసన్ నగరానికి మధ్య దూరానికి సమానమని అధికారులు చెప్పారు. అమెరికా అణు జలాంతర్గామి బూసన్ నగర తీరానికే రావడం గమనార్హం. కిమ్ దేశ క్షిపణులు తక్కువ ఎత్తులో ప్రయాణించాయని జపాన్ రక్షణ మంత్రి యసుకాజు హమాదా తెలిపారు. క్షిపణి రక్షణ వ్యవస్థలను తప్పించుకునేందుకే వీటిని తక్కువ ఎత్తులో ప్రయాణించేలా ప్రయోగిస్తున్నట్లు తెలుస్తోంది.

జులై 12 తర్వాత ఉత్తర కొరియా చేపట్టిన తొలి బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమం ఇదేనని నిపుణులు తెలిపారు. అంతకుముందు ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది ఉత్తర కొరియా. ఆ క్షిపణి అమెరికా భూభాగాన్ని తాకే సత్తా ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అప్పట్లో కిమ్ ప్రత్యక్షంగా ఈ పరీక్షను వీక్షించారు. అమెరికా- దక్షిణ కొరియా సైనిక కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో తమ అణు సామర్థ్యాన్ని పెంచుకుంటామని కిమ్ ప్రకటించారు.

Last Updated : Jul 19, 2023, 9:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.