ETV Bharat / international

విమానంలో ప్రయాణికుడి హల్​చల్​.. డోర్​ ఓపెన్​ చేసి రెక్కలపైకి వెళ్లి..

author img

By

Published : May 6, 2022, 3:56 PM IST

Updated : May 6, 2022, 4:21 PM IST

Man Opens Door on Flight: విమానం ల్యాండై మరికాసేపట్లో టెర్మినల్​ చేరుతుంది. ఇంతలో ఓ వ్యక్తి చేసిన పనికి అందులోని సిబ్బందితో పాటు అక్కడి ప్రయాణికులు కూడా హడలిపోయారు. అప్రమత్తమైన అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ?

విమానంలో ప్రయాణికుడి హల్​చల్
విమానంలో ప్రయాణికుడి హల్​చల్

Man Opens Door on Flight: కదులుతున్న విమానంలోని ఓ ప్రయాణికుడు హల్​చల్​ చేశాడు. మరికాపేట్లో విమానం టెర్మినల్​ చేరుతుందనగా హఠాత్తుగా తలుపు ఓపెన్​ చేశాడు. దీంతో అందులోని ప్రయాణికులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. ఆ ప్రయాణికుడిని సిబ్బంది అదుపు చేసేలోపు రెక్కల మీదకు నడుచుకుంటూ వెళ్లి అక్కడి నుంచి కిందకు దూకేశాడు. సిబ్బంది సమాచారంతో అక్కడికి చేరుకున్న అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన అమెరికాలోని షికాగో ఎయిర్​పోర్ట్​లో గురువారం (స్థానిక కాలమానం ప్రకారం) జరిగింది.

ఈ చర్యకు పాల్పడిన వ్యక్తిని కాలిఫోర్నియాకు చెందిన 57 ఏళ్ల ర్యాండీ ఫ్రాంక్​ డెవిలాగా పోలీసులు గుర్తించారు. శాండియాగో నుంచి వస్తున్న ఈ విమానం ల్యాండ్​ అవగానే కిందకు దూకేసిన ర్యాండీ.. ఫ్లైట్​ను టెర్మినల్​కు చెర్చేందుకు పైలట్లకు సూచనలు ఇచ్చే ప్రయత్నం చేసినట్లు అధికారులు వెల్లడించారు. బాధ్యతారాహితంగా వ్యవహరించినందుకుగాను ర్యాండీపై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్​కు తరలించారు.

అమెరికాలో ఈ తరహా ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఫిబ్రవరిలో విమానంలోని ఓ ప్రయాణికుడు దారి మధ్యలో తలుపు తెరిచేందుకు ప్రయత్నించి హంగామా సృష్టించాడు. అదుపు చేసే క్రమంలో ఆ ఫ్లైట్​ అటెండెంట్​ అతడిపై దాడి చేయాల్సి వచ్చింది. ఇటువంటివే మరో రెండు ఘటనలపై కూడా ఏప్రిల్​ అక్కడి అధికారులు సంబంధిత వ్యక్తులకు భారీ జరిమానా విధించారు. గతేడాదిలో ఈ తరహా ఘటనలపై దాదాపు 5,500పైగా ఫిర్యాదులు అధికారులు అందాయి.

ఇదీ చూడండి : పెళ్లి కోసం ప్రేయసి పక్కా ప్లాన్​.. ప్రియుడి కండోమ్​కు రంధ్రాలు.. చివరకు...

Last Updated : May 6, 2022, 4:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.