ETV Bharat / international

బ్రిటన్​ రాజుకు చేదు అనుభవం.. చార్లెస్​ దంపతులపై గుడ్లు విసిరిన నిరసనకారుడు

author img

By

Published : Nov 10, 2022, 8:34 AM IST

ఉత్తర ఇంగ్లాండ్‌లో పర్యటించిన బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌-3 దంపతులకు చేదు అనుభవం ఎదురైంది. రాజు కుటుంబానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఓ నిరసనకారుడు వారిపై గుడ్లను విసరడం కలకలం రేపింది.

king charles
బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌

బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌-3 దంపతులకు చేదు అనుభవం ఎదురైంది. ఉత్తర ఇంగ్లాండ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఛార్లెస్‌ దంపతులపై ఓ వ్యక్తి గుడ్లతో దాడి చేశాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, పలు సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేసే రాజు ఛార్లెస్‌-3.. ఈసారి మాత్రం తదేకంగా చూస్తూ ఉండిపోయారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇంగ్లాండ్‌లోని యార్క్‌ నగరంలో జరిగిన ఓ సంప్రదాయ వేడుకలో రాజు ఛార్లెస్‌-3, సతీమణి కెమిల్లాతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేడుకకు హాజరైన పౌరులతో కరచాలనం చేస్తూ, వారిని పలుకరిస్తూ ముందుకు సాగారు.

అదే సమయంలో జనసమూహంలో ఉన్న ఓ వ్యక్తి రాజుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఛార్లెస్‌పై గుడ్లు విసిరాడు. ఊహించని పరిణామంతో దంపతులిద్దరూ కొద్దిసేపు అక్కడే నిలబడిపోయారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిరసనకారుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఏడు దశాబ్దాల పాటు బ్రిటన్‌ను పాలించిన క్వీన్‌ ఎలిజిబెత్‌-2 ఈ ఏడాది సెప్టెంబర్‌లో మరణించిన సంగతి తెలిసిందే. అనంతరం బ్రిటన్‌ నూతన రాజుగా ఛార్లెస్‌-3 బాధ్యతలు చేపట్టారు. రాజు హోదాలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఛార్లెస్‌కు ఇంగ్లాండ్‌లో ఇలా ఊహించని అనుభవం ఎదురైంది.

  • King Charles III and Camilla, Queen Consort, were visiting the city of York on Wednesday when a protester hurled at least three eggs at them while shouting “this country was built on the blood of slaves.” https://t.co/mMIuTG2JKZ pic.twitter.com/KiqLDnz63x

    — The Washington Post (@washingtonpost) November 9, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి: 'అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకున్నాం.. ఇకపై కూడా కొనసాగిస్తాం'.. రష్యా వ్యాపారి కీలక వ్యాఖ్యలు

'రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై వెనక్కి తగ్గం'.. తేల్చి చెప్పిన జైశంకర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.