ETV Bharat / international

యుద్ధానికి 4 గంటల విరామం- అమెరికా ప్రకటన, ఖండించిన ఇజ్రాయెల్​- హమాస్​కు భారత్ సందేశం

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 10, 2023, 6:54 AM IST

Updated : Nov 10, 2023, 7:35 AM IST

Israel Hamas War Latest Update : మానవతా సాయం అందించడమే కాకుండా పాలస్తీనియన్లు దక్షిణ గాజాకు వెళ్లడానికి వీలుగా రోజుకు 4 గంటల చొప్పున ఉత్తర గాజాలో యుద్ధవిరామం పాటించడానికి ఇజ్రాయెల్ అంగీకరించిందని అమెరికా వెల్లడించింది. పౌరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు రెండో కారిడార్​ను తెరిచేందుకు అంగీకరించిందని పేర్కొంది. అయితే, అమెరికా ప్రకటనను ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం ఖండించింది. మరోవైపు, బందీలను వెంటనే విడుదల చేయాలని హమాస్​కు భారత్ స్పష్టం చేసింది.

Israel Hamas War Latest Update
Israel Hamas War Latest Update

Israel Hamas War Latest Update : గాజా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు వీలుగా రోజూ 4 గంటలు యుద్ధానికి విరామం ఇచ్చేందుకు ఇజ్రాయెల్ అంగీకరించినట్లు అమెరికా తెలిపింది. ప్రస్తుతానికి కాల్పుల విరమణకు ఎటువంటి అవకాశం లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. గాజా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు వీలుగా యుద్ధానికి విరామం ప్రకటించాలన్న నిర్ణయం తాను అనుకున్న దానికంటే ఆలస్యంగా జరిగిందని బైడెన్‌ పేర్కొన్నారు. హమాస్ వద్ద ఉన్న బందీలను విడిపించేందుకు, మిలిటెంట్లతో చర్చలు జరపడానికి యుద్ధాన్ని 3 రోజులు ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును కోరినట్లు తెలిపారు.

Israel Hamas War Latest Update
గాజా విడిచివెళ్తున్న ప్రజలు

గాజా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు ఉద్దేశించిన యుద్ధం విరామాన్ని ఇజ్రాయెల్ శుక్రవారం ప్రకటిస్తుందని అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు. ఇజ్రాయెల్ సైన్యం లక్ష్యంగా చేసుకున్న ప్రాంతాల నుంచి పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు వీలుగా రెండో కారిడార్‌ను తెరిచేందుకు ఆ దేశం అంగీకరించిందని వెల్లడించారు. మరోవైపు, అమెరికా ప్రకటనను ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం ఖండించింది.

Israel Hamas War Latest Update
ఆహారం కోసం లైన్లలో చిన్నారులు

మరోవైపు భూతల పోరులో కీలక ఘట్టానికి చేరుకున్నామని ప్రకటించిన ఇజ్రాయెల్‌ గాజా సిటీలో చాలా దూరం చొచ్చుకొచ్చింది. దేశంలో అతి పెద్ద అల్‌ షిఫా ఆసుపత్రి సమీపంలోకి ఇజ్రాయెల్‌ దళాలు చేరుకున్నాయి. హమాస్‌ దళాలతో అక్కడ తీవ్ర పోరు జరుగుతున్న నేపథ్యంలో ఆస్పత్రి వద్ద వేల మంది శరణార్థులు ఉన్నారు. హమాస్‌ ప్రధాన కమాండ్‌ సెంటర్‌ ఈ ఆసుపత్రి కింద ఉందని.. దానిని గుర్తించామని ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది. చాలా మంది హమాస్‌ కమాండర్లు ఇక్కడే ఉన్నారని చెప్పింది.

Israel Hamas War Latest Update
గాజాలో దృశ్యాలు
Israel Hamas War Latest Update
గాజా దృశ్యాలు

వారిని బేషరుతుగా విడుదల చేయాలని భారత్​ సూచన
India On Hamas Hostages Update : హమాస్ చెరలో ఉన్న బందీలను బేషరతుగా వెంటనే విడుదల చేయాలని భారత్‌ సూచించింది. రెండు వర్గాలు హింసకు స్వస్తి చెప్పాలని, ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని, నేరుగా శాంతి చర్చలు జరిగే పరిస్థితులను సృష్టించుకోవాలని స్పష్టం చేసింది. రెండు దేశాలు పరిష్కార దిశగా సాగాలని పిలుపునిచ్చింది.

Israel Hamas War Latest Update
ఆహారం కోసం లైన్లలో చిన్నారులు
Israel Hamas War Latest Update
మానవతా సాయం కోసం సిద్ధం చేసిన సామగ్రి

గాజా సిటీలోకి ఇజ్రాయెల్ సైన్యం- ప్రతి వీధిలోనూ కాల్పులు! సొరంగాల నెట్​వర్క్ ధ్వంసంపై ఫోకస్

గాజా ఆస్పత్రుల్లో రోగుల ఆర్తనాదాలు, 50వేల మందికి నాలుగే టాయిలెట్లు- 130 సొరంగాలు ధ్వంసం

Last Updated : Nov 10, 2023, 7:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.