ETV Bharat / international

Israel Hamas War 2023 : యుద్ధంతో ఆస్పత్రులు ఫుల్.. కనీస సౌకర్యాలు లేక అవస్థలు - ఇజ్రాయెల్ vs హమాస్

Israel Hamas War 2023 : ఇజ్రాయెల్‌ వైమానిక దాడులతో గాజాలో పరిస్థితి దారుణంగా తయారైంది. ఎటుచూసినా శిథిలాల కుప్పలే కనిపిస్తున్నాయి. భీకర దాడులకు సామాన్య ప్రజలూ బలవుతున్నారు. వేల సంఖ్యలో గాయపడుతున్నారు. వారికి సరిపడినన్ని ఆసుపత్రుల్లేక నరకం చూస్తున్నారు. కనీసం ఆహారం, నీరు లేకపోవడం వల్ల ఆకలికి అల్లాడిపోతున్నారు.

Israel Hamas War 2023
ఇజ్రాయెల్ vs హమాస్
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 15, 2023, 6:10 PM IST

Israel Hamas War 2023 : ఉత్తర గాజాను ఖాళీ చేయాలని అల్టీమేటం జారీ చేసిన ఇజ్రాయెల్‌... తాజాగా దక్షిణ గాజా ప్రాంతంపై కూడా వైమానిక దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో వందల భవనాలు, కట్టడాలు నేలమట్టమయ్యాయి. కూలిన శిథిలాల కింద వందల సంఖ్యలో చిక్కుకొని ఆర్తనాదాలు చేస్తున్నారు. ఈ దాడుల్లో పెద్దఎత్తున ప్రాణనష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఖాన్‌యూనిస్‌ అనే ప్రాంతంలో క్షతగాత్రులు, సాధారణ రోగులతో గత ఎనిమిది రోజులుగా ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి.

ఆసుపత్రుల్లో ఔషధాలు, ఆక్సిజన్‌, రక్తం కొరతతో బాధితులు ఇబ్బందులు పడుతున్నారు అక్కడి ప్రజలు. కొంతమంది స్థానికులు స్వచ్ఛందంగా రక్తం ఇస్తున్నారు. విద్యుత్‌ లేక యూనిస్‌ ఆసుపత్రుల్లో జనరేటర్ల సాయంతో రోగులకు వైద్యం అందిస్తున్నారు. అయినప్పటికీ తీవ్రమైన వైద్యుల కొరత, ఇంధనం లేక వేలాది మరణాలు సంభవించనున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.

Israel Hamas War 2023
గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు.. భారీ సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతున్న బాధితులు

మరోవైపు ఇజ్రాయెల్‌ దాడుల్లో గాజా దక్షిణ ప్రాంతంలోని పౌరుల ఇళ్లు పెద్దఎత్తున ధ్వంసమవుతున్నాయి. ఓ భవన సముదాయంపై బాంబులు పడి నేలకూలగా అందులో చాలమంది చిన్నారులు, మహిళలు చిక్కుకున్నారు. వారిని రక్షించడానికి స్థానికులు తీవ్రంగా శ్రమించిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. బుల్‌డోజర్ల సాయంతో శిథిలాలను తొలగించి భాదితులను ఆసుపత్రులకు తరలించారు.

యుద్ధం వల్ల సామాన్యుల పరిస్థితి హృదయవిదారకంగా ఉంది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని దక్షిణ ప్రాంతానికి వేలాదిమంది వలస వెళుతుండగా.. తీవ్రమైన రద్దీ నెలకొంది. నీరు, ఆహారం దొరక్క వలసవచ్చిన వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీస వసతులు లేక రహదారులపైనే పడిగాపులు గాస్తున్నారు.

గాజా ప్రజల కన్నీటి కష్టాలు.. ఆహారం కోసం పాట్లు.. 'అది వాళ్లకు ఉరిశిక్షతో సమానం'
Gaza Crisis 2023 : ఇటీవలే ఉత్తర గాజాను ఖాళీ చేయాలన్న ఇజ్రాయెల్‌ హెచ్చరికలతో అక్కడి ప్రజలు నానాపాట్లు పడుతున్నారు. ఆహారం, తాగు నీటి కోసం అలమటిస్తున్నారు. ఇజ్రాయెల్​ ఆదేశాలతో కొందరు ఉత్తర గాజాను వదిలి వెళ్తుండగా.. మరికొందరు ఆస్పత్రుల్లో తలదాచుకుంటున్నారు. దక్షిణ గాజా వైపు పాలస్తీనియన్లు ప్రత్యేక కారిడార్ల ద్వారా త్వరగా వెళ్లిపోవాలని మరోసారి హెచ్చరించింది ఇజ్రాయెల్​. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Israel Ground Attack On Gaza : ముప్పేట దాడికి ఇజ్రాయెల్ సిద్ధం.. డెడ్​లైన్​ ముగింపుతో భీకర పోరుకు సన్నాహాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.