ETV Bharat / international

Israel Enters Gaza : గాజాలోకి ఇజ్రాయెల్​ బలగాలు ఎంట్రీ.. హమాస్​ను​ నాశనం చేస్తామని ప్రధాని ప్రతిజ్ఞ - ఇజ్రాయెల్​ హమాస్​ యుద్ధం

Israel Enters Gaza : గాజాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. వారం రోజులుగా వైమానిక దాడులతో విరుచుకుపడతున్న ఇజ్రాయెల్‌ బలగాలు.. శుక్రవారం నేరుగా ఆ ప్రాంతంలో అడుగుపెట్టాయి. మరోవైపు, హమాస్​ను నాశనం చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని ప్రతిజ్ఞ చేశారు.

Israel Enters Gaza
Israel Enters Gaza
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 14, 2023, 7:32 AM IST

Updated : Oct 14, 2023, 8:09 AM IST

Israel Enters Gaza : హమాస్‌ ఉగ్రవాదులను మ‌ట్టుబెట్టేందుకు తీవ్రంగా యత్నిస్తున్న ఇజ్రాయెల్ సైన్యాలు.. గాజాలో అడుగుపెట్టాయి. హమాస్‌ స్థావరాలపై గత వారం రోజులుగా వైమానిక దాడులతో విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. శుక్రవారం నేరుగా ఉత్తర గాజాలో ప్రవేశించి భూతల దాడులు ప్రారంభించాయి. ఈ మేరకు ఇజ్రాయెల్​ సైన్యం ఓ ప్రకటనలో పేర్కొంది. మిలిటెంట్లతో పోరాడేందుకు, ఆయుధాలను ధ్వంసం చేయడానికి, బందీలుగా పట్టుకున్న వారిని వెతకడం కోసం తమ సైన్యం వెళ్లిందని వెల్లడించింది.

అయితే 24 గంటల్లోగా ఉత్తర గాజాను విడిచి వెళ్లిపోవాలని అక్కడున్న 11 లక్షల మందిని శుక్రవారం ఇజ్రాయెల్ సైన్యం ఆదేశించింది. గడువులోగా వెళ్లకపోతే తర్వాతి జరిగే పరిణామాలకు తాము బాధ్యులం కాదని స్పష్టం చేసింది. దీంతో ప్రాణభయంతో అనేకమంది వలసబాట పట్టారు. ఇళ్లను ఖాళీ చేసి దక్షిణ గాజా ప్రాంతాలకు వెళుతున్నారు. అయితే గాజా సిటీ నుంచి వెళ్లిపోతున్న వారిపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు జరపడం వల్ల 70 మంది మృత్యువాత పడ్డారని హమాస్‌ అధికారులు తెలిపారు. మృతుల్లో అధికంగా మహిళలు, చిన్నారులేనని పేర్కొన్నారు.

Israel Hamas War Update : గాజా నుంచి తప్పించుకోడానికి ఈజిప్టు సరిహద్దులో ఉన్న రాఫా క్రాసింగ్ ఏకైక మార్గం​. కానీ దాన్ని కూడా సోమవారం మూసేశారు. దీంతో అక్కడికి చేరుకున్న శరణార్థులు ఈజిప్టు అనుమతి కోసం వేచిచూస్తున్నారు. ఇలా ఎదురచూస్తున్న వారిలో ఓ భారతీయ కుటుంబం కూడా ఉంది. ఇజ్రాయెల్ హెచ్చరిక తర్వాత.. గాజాలో నివాసం ఉండే జమ్ముకశ్మీర్ వాసి లుబ్నా నజీర్ షాబూ అనే మహిళ తన కుటుంబంతో సహా రాఫా క్రాసింగ్​ వద్దకు చేరుకుంది.

"నేను నా భర్త, కుమార్తెతో ఇంటి నుంచి బయలుదేరాను. ఈజిప్టు సరిహద్దుకు సమీపంలో ఉన్న గాజా దక్షిణ భాగానికి చేరుకోవడానికి చాలా కష్టాలు పడ్డాను. ఇజ్రాయెల్ బాంబు దాడులలో రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. రవాణా కూడా ప్రధాన సమస్య" అని లుబ్నా నజీర్ షాబూ అక్కడి పరిస్థితిని వివరించారు. ఈజిప్టులో తన మరో ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారని చెప్పిన లుబ్నా నజీర్​.. ఆ దేశం అనుమతించే వరకు ఇక్కడే వేచి చూస్తామని తెలిపింది.

హమాస్​ను నాశనం చేస్తాం : ఇజ్రాయెల్ ప్రధాని
Netanyahu Warning : గాజా స్ట్రిప్​లోకి ప్రవేశించి దాడులు ఇజ్రాయెల్​ దాడులు చేస్తున్న నేపథ్యంలో.. హమాస్​కు మరోసారి ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్ జాతీయ టెలివిజన్​లో మాట్లాడిన నెతన్యూహు.. ఆ ఉద్రవాద సంస్థను నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. 'ఇది ఆరంభం మాత్రమే. గతంలో కంటే బలంగా ఈ యుద్ధాన్ని ముగిస్తాము. హమాస్​ను అంతం చేస్తాం. ఈ ఆపరేషన్​కు మాకు అంతర్జాతీయంగా మద్దతు ఉంది' ఉంది అని మాస్​ వార్నింగ్ ఇచ్చారు.

సౌదీ ప్రిన్స్​తో జైశంకర్​ ఫోన్​ కాల్​..
పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులపై సౌదీ ప్రిన్స్​ ఫైసల్ బిన్ ఫర్హాన్​తో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ శుక్రవారం ఫోన్​లో చర్చించారు. దీనికి రెండు రోజుల ముందు.. ఇదే విషయమై యూఏఈ విదేశాంగ మంత్రి షేక్​ అబ్దుల్లా బిన్ జాయెద్​ అల్​ నహ్యాన్​తో జైశంకర్​ మట్లాడారు.

  • Appreciated the conversation with Foreign Minister HH @FaisalbinFarhan of Saudi Arabia.

    Discussed the grave situation in the Middle East.

    — Dr. S. Jaishankar (@DrSJaishankar) October 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఆపరేషన్ అజయ్.. రెండో విమానం..
ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ నుంచి భారతీయులను స్వదేశానికి తరలించే ఆపరేషన్ అజయ్​ కొనసాగుతోంది. అందులో భాగంగా ఇద్దరు చిన్నారులతో పాటు 235 మందితో రెండో విమానం భారత్​కు చేరకుంది.

  • #WATCH | Various state governments have sent their representatives to Delhi airport as the second flight carrying 235 Indian nationals from Israel, arrived here today. pic.twitter.com/kuhAMjZWHg

    — ANI (@ANI) October 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Israel Hostages Killed : 6వేల క్షిపణులతో గాజాపై ఇజ్రాయెల్ దాడి.. 13 మంది బందీలు మృతి.. దిల్లీలో హైఅలర్ట్!

Israel Hamas War Latest : హమాస్ పక్కా ప్లాన్.. ఇజ్రాయెల్​పై దాడికి ముందు గట్టి ప్రాక్టీస్.. కాగితపు బొమ్మలను కాలుస్తూ..

Last Updated : Oct 14, 2023, 8:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.