ETV Bharat / international

ఇజ్రాయెల్‌ వైద్యుల అద్భుతం.. తెగిన తలను అతికించి బాలుడికి పునర్జన్మ - ప్రమాదంలో తెగిపోయిన బాలుడి తల

Israel Doctor Reattach Head : ఇజ్రాయెల్‌ వైద్యులు అరుదైన ఘనత సాధించారు. తెగిన తలను తిరిగి అతికించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ పన్నెండేళ్ల బాలుడికి శస్త్రచికిత్స చేసి.. పునర్జన్మ ప్రసాదించారు.

Boy decapitated head reattached by Israeli doctors
తెగిన తలను తిరిగి అతికించిన ఇజ్రాయెల్ వైద్యులు
author img

By

Published : Jul 15, 2023, 9:06 AM IST

Israel Doctor Reattach Head : వైద్యశాస్త్ర చరిత్రలో అరుదైన ఘటన ఆవిష్కృతమైంది. అసాధ్యమని భావిస్తున్న ఓ చికిత్సా విధానాన్ని.. తమ హస్తవాసి ద్వారా సుసాధ్యమేనని నిరూపించారు ఇజ్రాయెల్‌ వైద్యులు. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై మృత్యు ఒడికి చేరువలో ఉన్న ఓ బాలుడికి.. ఆధునిక సాంకేతికత, తమ నైపుణ్యాన్ని మేళవించి పునర్జన్మ ప్రసాదించారు. శరీరం నుంచి అంతర్గతంగా విడిపోయిన తలను అతికించి ప్రాణాలు నిలబెట్టారు.

12 ఏళ్ల సులేమాన్‌ హసన్‌కు సైకిల్‌ రైడ్‌ ఎంతో ఇష్టం. ఇతడు జోర్డాన్‌ వ్యాలీకి చెందిన బాలుడు. రోజూ పాఠశాల నుంచి ఇంటికి రాగానే తన సైకిల్‌పై వ్యాలీలోని రోడ్లపై చక్కర్లు కొట్టడం అలవాటు. రద్దీగా ఉండే ఆ రోడ్లపై జాగ్రత్తగా ఉండాలని తల్లిదండ్రులు బాలుడ్ని తరచుగా హెచ్చరించేవారు. ఓ రోజు సైకిల్‌ తొక్కుకుంటూ వెళ్లిన హసన్‌ను ప్రమాదవశాత్తు ఓ కారు ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాల పాలైన బాలుడ్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు స్థానికులు. "ప్రమాదంలో హసన్‌ మెడ భాగంలో, పొత్తి కడుపులో బలమైన గాయమైనట్లు వైద్యులు గుర్తించారు. తల, శరీరం దాదాపు ఒకదాన్నుంచి మరోటి వేరైన స్థితిలో హసన్‌ను ఆస్పత్రికి తీసుకువచ్చారు. తలతో వెన్నెముక చివరి అంచును కలిపి ఉంచే భాగం దాదాపు విడిపోయింది.' జెరూసలేంలోని హదస్సా ఈన్‌ కెరెమ్‌ ఆస్పత్రి వైద్యులు ఈ కేసును ఓ సవాలుగా స్వీకరించారు. అనంతరం ఆపరేషన్​ చేసి బాలుడి ప్రాణాలు నిలబెట్టారు.

"బాలుడు ఉన్న పరిస్థితి చూసి.. మేమంతా నివ్వెరపోయాం. తల, మెడ కలిసే చోటులోని లిగ్మెంట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. సమీక్ష నిర్వహించి ఆపరేషన్‌ వెంటనే చేయాలని నిర్ణయించాం. శస్త్రచికిత్స చేసి హసన్‌ తల, వెన్నెముకను తిరిగి కలిపాం. ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ. హాస్పటల్​లోని అన్ని విభాగాల స్పెషలిస్ట్‌ వైద్యులు కొన్ని గంటలపాటు తీవ్రంగా శ్రమించారు. శస్త్ర చికిత్స సమయంలో వైద్యుల సాంకేతిక అనుభవం ఎంతగానో ఉపయోగపడింది. ప్రమాదం జరిగిన వెంటనే ట్రామా సిబ్బంది సత్వరం స్పందించి ప్రాథమిక చికిత్స అందించడం నుంచి.. ఆపరేషన్‌ చేయడం వరకూ ప్రతి చర్య హసన్‌ ప్రాణాల్ని నిలబెట్టింది. మా ప్రయత్నం వృథా కాలేదు. ఆపరేషన్‌ విజయవంతమైంది."
-డా.ఓహాద్‌ ఈనావ్‌, బాలుడికి ఆపరేషన్ చేసిన వైద్యుడు

బతికే అవకాశం తక్కువ ఉన్నా.. అనుభవంతో కాపాడారు..
హసన్‌కు జూన్​లో ఆపరేషన్​ చేయగా.. ప్రస్తుతం అతని పరిస్థితి మెరుగుకావడం వల్ల హాస్పిటల్​ నుంచి డిశ్చార్జ్‌ చేశారు. ఆపరేషన్‌ అనంతరం నెలరోజుల పాటు హసన్‌ను హాస్పిటల్​ వైద్యులు, నర్సులు అనుక్షణం గమనిస్తూ కంటికి రెప్పలా కాపాడారు. బతకడనుకున్న తమ కుమారుడికి పునర్జన్మనిచ్చిన వైద్యులకు హసన్‌ తండ్రి ధన్యవాదాలు తెలిపారు. తన ఒక్కగానొక్క బిడ్డను తిరిగి ప్రాణాలతో తమకు అప్పగించిన వైద్యులకు జీవితాంతం రుణపడి ఉంటానని ఆయన వెల్లడించారు. ప్రమాదం జరిగిన తర్వాత బతికే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ.. అపార అనుభవం కలిగిన వైద్య సిబ్బంది, ట్రామా, ఆర్థోపెడిక్‌ బృందాలు సత్వర నిర్ణయాలు తీసుకొని సాంకేతికత సాయంతో మా అబ్బాయిని కాపాడాయని వివరించారు. 'ఇందుకు నేను వారికి పెద్ద థ్యాంక్స్‌ చెప్పడం తప్పా మరేమీ చేయలేన'ని హసన్‌ తండ్రి పేర్కొన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.