ETV Bharat / international

Iron Dome Israel : ఇజ్రాయెల్​కు 12ఏళ్లుగా 'ఐరన్​ డోమ్' రక్షణ.. లేకుంటే ఊహించని స్థాయిలో నష్టం! - ఐరన్​ డోమ్​ ఇజ్రాయెల్​ రక్షణ

Iron Dome Israel : ఐరన్‌ డోమ్‌.. 12 ఏళ్లుగా శత్రు రాకెట్ల నుంచి ఇజ్రాయెల్‌ను కాపాడుతూ వస్తున్న గగనతల రక్షణ వ్యవస్థ ఇది. దీన్ని ఛేదించడానికి అనేకసార్లు యత్నించిన హమాస్‌ మిలిటెంట్‌ సంస్థ ఈసారి కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 5 వేల రాకెట్లను ప్రయోగించింది. వీటిలో చాలా రాకెట్లను ఐరన్‌ డోమ్‌ అడ్డుకున్నా కొన్ని మాత్రం జనావాసాలపై పడి ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగించాయి. ఐరన్‌డోమ్ లేకపోతే నష్టం ఊహించలేని స్థాయిలో ఉండేది.

Iron Dome Israel
Iron Dome Israel
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 8, 2023, 2:26 PM IST

Iron Dome Israel : 20 నిమిషాల్లో 5 వేల రాకెట్లు.. గాజా పట్టీ నుంచి ఇజ్రాయెల్‌పై హమాస్‌ మిలిటెంట్‌ సంస్థ ప్రయోగించిన రాకెట్ల సంఖ్య ఇది. నిజంగా ఇవన్నీ ఇజ్రాయెల్‌లో పడితే భారీగా ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభవిస్తుంది. అయితే ఇజ్రాయెల్‌ వద్ద ఉన్న ఐరన్‌ డోమ్‌ గగనతల రక్షణ వ్యవస్థ వీటిలో అనేక రాకెట్లను మధ్యలోనే అడ్డుకుంది. 12 ఏళ్ల క్రితం సేవలు అందించడం ప్రారంభించిన ఈ వ్యవస్థ ఇప్పటి వరకు వేల కొద్దీ రాకెట్లను గాల్లోనే ధ్వంసం చేసింది. తాజాగా ఇజ్రాయెల్‌-పాలస్తీనా మధ్య తీవ్ర ఘర్షణలు చోటు చేసుకోవడం వల్ల మరోసారి ఈ గగనతల రక్షణ వ్యవస్థ వార్తల్లో కేంద్రబిందువుగా నిలిచింది.

అమెరికా ఆర్థిక సహకారంతో దశాబ్దం క్రితం..
Iron Dome Israel In Action : సాధారణంగా సమీప దూరాల్లోని ప్రత్యర్థుల స్థావరాలను ధ్వంసం చేయడానికి స్వల్ప శ్రేణి రాకెట్లు, శతఘ్నులు, మోర్టార్లను వినియోగిస్తుంటారు. దూరం తక్కువ ఉండటం వల్ల ఇలాంటి వాటిని ఎదుర్కోవడానికి శత్రువులకు తగినంత సమయం లభించదు. అటువంటి ముప్పులను ముందుగానే గమనించి గాల్లోనే ధ్వంసం చేసే వ్యవస్థను ఇజ్రాయిల్‌కు చెందిన రఫేల్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ అమెరికా ఆర్థిక సహకారంతో దశాబ్దం క్రితం అభివృద్ధి చేసింది. దానిని ఐరన్‌ డోమ్‌గా వ్యవహరిస్తుంది.

Iron Dome Israel
'ఐరన్‌ డోమ్‌' గగనతల రక్షణ వ్యవస్

2011లో వినియోగంలోకి..
Iron Dome Defence System : 2011లో ఐరన్ డోమ్​ను వినియోగంలోకి తీసుకొచ్చింది. వివిధ ప్రాంతాల్లో దీన్ని మోహరించింది. గాజాపట్టీ వైపు నుంచి ఉగ్రవాదులు ప్రయోగించే రాకెట్లు, శతఘ్ని గుండ్లను ఇది ఎదుర్కొంటోంది. దీని రేంజ్​ 70 కిలోమీటర్ల వరకు ఉంది. ఇది కాకుండా ఇజ్రాయెల్‌ వద్ద డేవిడ్‌స్లింగ్‌, యారో అనే రెండు వ్యవస్థలు ఉన్నాయి. ఇవి దీర్ఘశ్రేణి క్షిపణుల వంటి వాటిని ఎదుర్కొంటాయి.

రాడార్లు, సాఫ్ట్‌వేర్‌, రాకెట్‌ ప్రయోగించే బ్యాటరీలు..
Iron Dome Explained : ఐరన్‌డోమ్‌ వ్యవస్థ మొత్తంలో రాడార్లు, సాఫ్ట్‌వేర్‌, రాకెట్‌ ప్రయోగించే బ్యాటరీలు ఉంటాయి. గాజా పట్టీలో రాకెట్‌ ప్రయోగించిన వెంటనే రాడార్‌ పసిగట్టి.. దాని గమనాన్ని సాఫ్ట్‌వేర్‌ వ్యవస్థకు పంపిస్తుంది. వచ్చే రాకెట్‌ ఏ ప్రదేశంలో పడుతుందో గుర్తిస్తుంది. ఆ ప్రదేశం ఖాళీగా ఉంటే రాకెట్‌ను ప్రయోగించదు. అదే వ్యూహాత్మక ప్రాంతంలో, జనావాసాలపై పడే అవకాశం ఉంటే మాత్రం బ్యాటరీ నుంచి రాకెట్‌ను ప్రయోగిస్తుంది. ఐరన్‌ డోమ్‌ నుంచి వెలువడిన టమిర్‌ క్షిపణి ప్రత్యర్థుల రాకెట్‌ను గాల్లోనే పేల్చి వేస్తుంది.

Iron Dome Israel
రాకెట్ల దాడికి ఇజ్రాయెల్​లో విధ్వంసం

సాఫ్ట్​వేర్​ను మాత్రం..
Iron Dome Manufacturer : 2011లో ప్రవేశపెట్టిన ఐరన్‌ డోమ్‌ వ్యవస్థ కీలక విభాగాలను ఇజ్రాయెల్‌ ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తోంది. హార్డ్‌వేర్‌లో పెద్దగా మార్పులు చేయకపోయినా.. ముప్పును విశ్లేషించే సాఫ్ట్‌వేర్‌ను మాత్రం బాగా అభివృద్ధి చేసింది. ఇజ్రాయెల్‌ సరిహద్దుల్లో దీనిని అమర్చిన నాటి నుంచి వేల సంఖ్యలో హమాస్‌ రాకెట్లను ఇది కూల్చేసింది. ఇది 90 శాతం విజయవంతంగా పని చేసినట్లు చెబుతారు. అంతకు ముందు గాజాపట్టీ వైపు నుంచి దాడులు జరిగితే అక్కడకు ఇజ్రాయెల్‌ సైన్యాన్ని పంపించాల్సి వచ్చేది. అప్పుడు మరిన్ని ఘర్షణలు జరిగి ఇరు పక్షాలవైపు ప్రాణనష్టం ఎక్కువగానే ఉండేది. కానీ, ఈ వ్యవస్థ వచ్చాక దళాలు అక్కడకు వెళ్లాల్సిన అవసరం లేదు.

సైరన్‌ విన్నాక ప్రజలు..
Iron Dome Siren Sound : ఐరన్​ డోమ్​ వ్యవస్థలోని అప్రమత్తం చేసే సైరన్‌ విని ప్రజలు సురక్షిత స్థానాలకు తరలివెళుతున్నారు. అమెరికా రక్షణ శాఖ కూడా ఇజ్రాయెల్‌ నుంచి ఈ వ్యవస్థలను కొనుగోలు చేసి వినియోగిస్తోంది. ఈ ఐరన్‌ డ్రోన్‌ రక్షణ వ్యవస్థను ఛేదించాలని హమాస్‌ ఎప్పటికప్పుడు ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగానే తాజా దాడిలో కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 5 వేల రాకెట్లను ప్రయోగించింది. అంత తక్కువ సమయంలో పెద్ద సంఖ్యలో దూసుకొస్తున్న రాకెట్లను నిలువరించడం ఏ వ్యవస్థకైనా కష్టసాధ్యమే. అందుకే కొన్ని రాకెట్లు ఇజ్రాయెల్‌లోని జనావాసాలపై పడి ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగించాయి.

Iron Dome Israel
హమాస్‌ మిలిటెంట్‌ సంస్థ ప్రయోగించిన రాకెట్లు

Iron Dome Vs Hamas Rockets : ఇజ్రాయెల్‌ ప్రత్యర్థి అయిన హమాస్‌ మిలిటెంట్‌ సంస్థ తమ వద్ద ఉన్న రాకెట్లను ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకుంటోంది. ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవివ్‌, జెరూసలెం వంటి నగరాలకు సైతం చేరేలా తమ రాకెట్లను అభివృద్ధి చేస్తోంది. చిన్న స్థాయి ఖాస్సామ్‌ రాకెట్లను భారీ సంఖ్యలో ప్రయోగిస్తోంది. దీనిని హమాసే ఇరాన్‌ సహకారంతో అభివృద్ధి చేసింది. ఒక్కో రాకెట్‌ ఖరీదు 4వేల డాలర్ల లోపే ఉంటుందని అంచనా. వీటిని అడ్డుకోవడానికి ఇజ్రాయెల్‌ ప్రయోగించే ఒక్కో క్షిపణి ఖరీదు 80వేల డాలర్లు ఉంటుంది. హమాస్‌ వద్ద వేల సంఖ్యలో ఖాస్సామ్‌ రాకెట్లు ఉన్నాయి. అందుకే ఒకేసారి 5 వేల రాకెట్లను అది ప్రయోగించింది. ఈ రాకెట్లకు అవసరమైన ముడిపదార్థాలను ఇరాన్‌ నుంచి ఈజిప్ట్‌ సరిహద్దుల మీదగా తీసుకొస్తారన్న ఆరోపణలు ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.