ETV Bharat / international

40వేల అడుగుల ఎత్తులో రెండుసార్లు కార్డియాక్ అరెస్ట్​.. కాపాడిన భారతీయ వైద్యుడు - విమానంలో ప్రయాణికుడి ప్రాణాలను కాపాడిన డాక్టర్

గగనతలంలో 40వేల అడుగులో ఎత్తులో ఓ విమాన ప్రయాణికుడు రెండుసార్లు కార్డియాక్‌ అరెస్టుకు గురయ్యాడు. ఈ క్రమంలో ఓ వైద్యుడు 5 గంటలపాటు కష్టపడి అతడి ప్రాణాలను కాపాడారు. యూకే నుంచి భారత్​ వచ్చిన విమానంలో ఈ ఘటన జరిగింది.

Indian origin doctor vishwaraj vemala
విశ్వరాజ్‌ వేమల
author img

By

Published : Jan 6, 2023, 5:36 PM IST

40వేల అడుగుల ఎత్తులో విమానం ప్రయాణిస్తుండగా.. అందులో ఓ వ్యక్తి రెండుసార్లు గుండెపోటుకు గురయ్యారు. అదృష్టవశాత్తూ అదే విమానంలో ఉన్న భారత సంతతి వైద్యుడు.. ఐదు గంటలు కష్టపడి ఆ ప్రయాణికుడి ప్రాణాన్ని నిలబెట్టారు. గతేడాది నవంబరులో యూకే నుంచి భారత్‌కు వచ్చిన విమానంలో ఈ ఘటన జరగగా.. తాజాగా బర్మింగ్‌హమ్‌ యూనివర్శిటీ ఆసుపత్రి తమ ట్విట్టర్​ ఖాతాలో షేర్‌ చేయడం వల్ల వెలుగులోకి వచ్చింది.

తమ హాస్పిటల్‌లో హెపటాలజిస్ట్‌గా పనిచేస్తున్న డా.విశ్వరాజ్‌ వేమల.. విమాన ప్రయాణంలో గుండెపోటుకు గురైన ఓ ప్రయాణికుడిని కాపాడారని బర్మింగ్‌హమ్‌ ఆసుపత్రి ట్విట్టర్​లో వెల్లడించింది. పరిమిత వైద్య సదుపాయాలు ఉన్నప్పటికీ ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఆ వ్యక్తికి పునర్జన్మనిచ్చారని కొనియాడింది. ఆ వ్యక్తి ప్రాణం కాపాడేందుకు ఐదు గంటలు తాము యుద్ధం చేశామని డా.విశ్వరాజ్‌ ఈ సందర్భంగా వెల్లడించారు.

మాట్లాడుతుండగానే గుండెపోటు..
"నా తల్లిని తీసుకుని యూకే నుంచి భారత్ వస్తుండగా.. మేం ప్రయాణిస్తున్న విమానంలో ఓ వ్యక్తి కార్డియాక్‌ అరెస్ట్‌కు గురయ్యారు. డాక్టర్‌ కోసం సిబ్బంది పిలవగానే.. నేను వెళ్లా. అప్పటికే ఆ ప్రయాణికుడి పల్స్‌ ఆగిపోయింది. శ్వాస కూడా తీసుకోవడం లేదు. దాదాపు గంటసేపు ప్రయత్నించి అతడిని స్పృహలోకి తీసుకురాగలిగా. కానీ, అతడు పూర్తిగా కోలుకున్నట్లు కన్పించలేదు. క్యాబిన్‌ సిబ్బంది దగ్గర ఉన్న మెడికల్‌ కిట్‌లో ఆక్సిజన్‌, ఆటోమేటెడ్‌ ఎక్స్‌టర్నల్‌ డీఫిబ్రిలేటర్‌ తప్ప మరో వైద్య పరికరం లేదు. దీంతో నేను ప్రయాణికుల వద్ద ఏమైనా ఉన్నాయా అని అడిగా. అదృష్టవశాత్తూ వారి నుంచి హార్ట్‌ రేట్‌ మానిటర్‌, బీపీ మెషిన్‌, పల్స్‌ ఆక్సిమీటర్‌, గ్లూకోజ్‌ మీటర్‌ సాధించి.. ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించా. అయితే నాతో మాట్లాడుతుండగానే ఆ వ్యక్తి రెండోసారి కార్డియాక్‌ అరెస్టుకు గురయ్యారు. ఈసారి అతడిని స్పృహలోకి తీసుకొచ్చేందుకు చాలా సమయం పట్టింది. రెండు గంటలకు పాటు అతడి బీపీ, పల్స్‌ పడిపోయాయి. అయినా మేం ప్రయత్నం ఆపలేదు. మొత్తంగా నేను, క్యాబిన్‌ సిబ్బంది ఐదు గంటల పాటు అతడిని స్పృహలో ఉండేందుకు శ్రమించాం" అని డా.విశ్వరాజ్‌ వివరించారు. ప్రయాణికుడి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా విమానాన్ని ముంబయి ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్‌ చేయగా.. అప్పటికే అక్కడ వేచి ఉన్న ఎమర్జెన్సీ వైద్య సిబ్బందికి ఆ ప్రయాణికుడిని అప్పగించినట్లు విశ్వరాజ్‌ తెలిపారు.

"నా మెడికల్‌ ట్రైనింగ్‌లో ఇలాంటి కేసులు ఎన్నో చూశా. కానీ 40వేల అడుగుల ఎత్తులో ఓ ప్రాణాన్ని కాపాడగలిగా. నాతో పాటు ప్రయాణికులంతా భావోద్వేగానికి గురయ్యాం. ఎయిర్‌పోర్టులో వైద్య సిబ్బంది ఆ ప్రయాణికుడిని తీసుకెళ్తుండగా.. అతడి కళ్లు చెమర్చాయి. 'మీకెప్పటికీ రుణపడి ఉంటా' అని ఆయన నాతో అన్నారు. అది చాలా ఉద్వేగభరిత క్షణం. జీవితాంతం గుర్తుంచుకుంటా"

--డా.విశ్వరాజ్‌ వేమల, హెపటాలజిస్ట్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.