ETV Bharat / international

లిఫ్ట్​లో ముద్దులు పెట్టి మైనర్లపై వేధింపులు.. సింగపూర్​లో భారత 'చెఫ్'​కు కఠిన జైలుశిక్ష! - సింగపూర్​లో భారత వ్యక్తికి జైలుశిక్ష

సింగపూర్​లో చెఫ్​గా పనిచేస్తున్న ఓ భారత సంతతి వ్యక్తికి నాలుగు నెలల జైలు శిక్ష విధించింది కోర్టు. ఇద్దరు బాలికలను వేధించిన కేసులో ఈ శిక్ష విధించింది.

Indian chef jailed for molesting young girls in Singapore

author img

By

Published : Jun 24, 2023, 11:37 AM IST

ఇద్దరు బాలికలను వేధించిన కేసులో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తికి నాలుగు నెలల జైలు శిక్ష విధించింది సింగపూర్​ కోర్టు. సుశీల్​ కుమార్ అనే చెఫ్​.. రెండు కేసుల్లోనూ దోషిగా తేలాడని స్థానిక మీడియా తెలిపింది. రెండు ఘటనల్లోనూ బాలికలకు ముద్దులు పెడుతూ, హత్తుకుంటూ.. ప్రేమిస్తున్నానంటూ అసభ్యంగా ప్రవర్తించినట్లు తేలింది.

ఇదీ జరిగింది
గతేడాది ఆగస్టు 2న బాధిత బాలిక ఇంటి నుంచి రైల్వే స్టేషన్​కు వెళ్తోంది. ఇంతలో అక్కడికి వచ్చిన సుశీల్​ కుమార్.. బాలికతో మాటలు కలిపాడు. అడ్రస్​ అడుగుతున్నాడేమో అని భావించిన బాలిక అతడితో మాట్లడింది. అనంతరం బాలిక అనుమతి లేకుండా భుజాలపై చేతులు వేసి తన దగ్గరకు లాక్కున్నాడు. ఆమెను హత్తుకుని చెంపపై ముద్దు పెట్టాడు. ఆమెతో సెల్ఫీలు దిగి.. ఫోన్​ నెంబర్​ తీసుకున్నాడు. ఏదైనా అవసరం ఉంటే తనకు ఫోన్​ చేయమని చెప్పి.. మరోసారి ముద్దు పెట్టి వెళ్లాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిన బాలిక.. పరుగెత్తికెళ్లి తల్లికి జరిగిన విషయాన్నంతా చెప్పింది. దీంతో బాలిక తల్లి అతడిపై పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. ఈ విచారణలో మరిన్ని విషయాలు బయట పడ్డాయి. నిందితుడు.. వాట్సాప్​లో కూడా బాలికను వేధించినట్లు తేలింది. బాలికకు వాట్సాప్​లో రెండు సార్లు వీడియో కాల్​ చేయడానికి ప్రయత్నించాడు. కిస్​ ఎమోజీలను పంపించినట్లు తెలిసింది. దీంతో అతడిని అరెస్ట్ చేయగా.. ఆ తర్వాత రోజు స్టేషన్​ బెయిల్​పై విడుదలయ్యాడు.

స్టేషన్​ నుంచి విడుదలయ్యాక కూడా అతడి తీరు మారలేదు. నవంబర్​ 8న మరో బాలికను వేధించాడు. లిఫ్ట్ ఎక్కేందుకు ఎదురు చూస్తున్న ఓ బాలిక వద్దకు వెళ్లి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె అనుమతి లేకుండా భుజాలపై చేతులు వేసి ముద్దులు పెట్టాడు. లిఫ్ట్​ ఎక్కి వెళ్తుండగా.. అందులోకి వెళ్లి ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. లిఫ్ట్​లో ఆమెను పట్టుకుని ముద్దులు పెట్టాడు. అతడి తీరుతో విసుగుపోయిన బాలిక ఇంటికి వెళ్లి తన తల్లికి చెప్పింది. దీంతో అతడిని అరెస్ట్ చేసి సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

గోడ కూలి భారతీయుడు మృతి
సింగపూర్​లో జరిగిన మరో ఘటనలో గోడ కూలి ఓ భారత సంతతి వ్యక్తి మరణించాడు. ఈ ఘటన జూన్​ 15న సింగపూర్ సెంట్రల్​ బిజినెస్ జిల్లాలో జరిగింది. అతడు పనిచేస్తున్న భవనం సమీపంలో నడుస్తుండగా.. ఒక్కసారిగా పక్కనున్న గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో నిర్మాణ కార్మికుడు వినోద్ కుమార్​ శిథిలాల కింద పడి చనిపోయాడు. దీంతో సహాయక చర్యలు చేపట్టిన అధికారులు.. నాలుగు గంటలు శ్రమించి మృతదేహాన్ని బయటకు తీశారు. ఇతడిని తమిళనాడుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు అధికారులు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.