Hungary Train Crash: దక్షిణ హంగేరీలో మంగళవారం ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు క్షతగాత్రులయ్యారు. రైలు పట్టాలపైకి ట్రక్కు దూసుకురావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాదం సమయంలో రైలులో 22, ట్రక్కులో ఏడుగురు ప్రయాణికులు ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. దీంతో ట్రక్కులో ఉన్న వారు మరణించగా.. ఇద్దరికి తీవ్ర గాయాలు, ఎనిమిది మందికి స్వల్ప గాయాలయ్యాయని పేర్కొన్నారు. వెంటనే ప్రమాద స్థలానికి 10 అంబులెన్సులు, ఒక హెలికాప్టర్‌ను పంపించినట్లు పోలీసులు తెలిపారు. సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ టీం.. వాహనాలను మరో దారిలోకి మళ్లించింది.
ఇదీ చదవండి: జైలులో ఘర్షణ- 20 మంది ఖైదీలు మృతి