ETV Bharat / international

'ఇమ్రాన్ ఖాన్​ ఓ సైకో​.. అతడికి భారత్ నచ్చితే అక్కడికే వెళ్లాలి' - imran khan on india

Maryam to Pak PM Imran Khan: పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​కు పిచ్చిపట్టిందని విమర్శించారు ఆ దేశ విపక్ష నేత మరియమ్ నవాజ్. ఆయనను ఇకపై ప్రధానిగా, మాజీ ప్రధానిగా పరిగణించకూడదని అన్నారు. భారత్​ను ఇమ్రాన్​ ప్రశంసించడంపైనా మండిపడ్డారు మరియమ్.

Maryam
PM Imran Khan
author img

By

Published : Apr 9, 2022, 4:49 PM IST

Maryam to Pak PM Imran Khan: భారత్​పై ఇమ్రాన్​ ఖాన్​ ప్రశంసలు కురిపించడం పట్ల తీవ్రంగా మండిపడ్డారు ఆ దేశ విపక్ష నేత మరియమ్ నవాజ్. ఇమ్రాన్​ ఖాన్​కు భారత్​ అంతగా నచ్చితే అక్కడికే వెళ్లిపోవాలని అన్నారు. ఈ మేరకు ట్విట్టర్​ వేదికగా శనివారం విమర్శలు చేశారు.

"అధికారం కోల్పోవడం వల్ల పిచ్చి పట్టుకున్న వ్యక్తికి (ఇమ్రాన్​ ఖాన్​).. తాను బహిష్కరణకు గురైంది సొంత పార్టీ చేతిలోనే అని ఎవరైనా చెప్పాలి. నీకు భారత్​కు అంత నచ్చితే అక్కడికే వెళ్లు. మతిస్తిమితంలేని వ్యక్తి.. దేశాన్ని వినాశనం చేయకుండా ఆపాలి. ఇది జోక్ కాదు. ఆయనను ప్రధాని, మాజీ ప్రధానిగా పరిగణించకూడదు. స్వీయ రక్షణ కోసం దేశాన్ని తాకట్టు పెట్టిన సైకో ఆయన"

-మరియమ్ నవాజ్, పాక్ ప్రతిపక్ష నేత

అలాంటప్పుడు భారత్​ను అనుసరించాలి: "ఇమ్రాన్​ భారత్​ను పొగుడుతున్నారు. అవిశ్వాస తీర్మానం విషయంలోనూ ఆయన భారత్​ను అనుసరించాలి. భారత్​లో వివిధ ప్రధానమంత్రులపై దాదాపు 27 అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టారు. కానీ, ఇమ్రాన్​లా ఎవ్వరూ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, విలువలను అపహాస్యం చేయలేదు. వాజ్​పేయి ఒక్క ఓటు తేడాతో విశ్వాస పరీక్షలో ఓడారు. కానీ ఇమ్రాన్​లా దేశాన్ని తాకట్టు పెట్టలేదు." అని మరియమ్ ట్వీట్ చేశారు.

"పర్యవసానాలను ఎదుర్కొనేందుకు భయపడిన ఓ వెర్రివాడి వల్ల.. దేశం స్తంభించిపోయింది. 22 కోట్ల జనాభా గల దేశంలో వారాలుగా ప్రభుత్వమే లేదు. ఇంత దారుణ రాజ్యంగ ఉల్లంఘన, సుప్రీంకోర్టు ఆదేశాల విస్మరణ కారణంగా అతడి కథ ఘోరంగా ముగుస్తుంది." అని మండిపడ్డారు మరియమ్.

రాత్రి 8గంటలకు ఓటింగ్!: విపక్షాలు ఇమ్రాన్‌ ఖాన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన దగ్గరి నుంచి పాక్‌లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. సుప్రీం తీర్పుతో ఆ తీర్మానంపై ఓటింగ్‌ నిర్వహించేందుకు ఈ రోజు (శనివారం) ఉదయం జాతీయ అసెంబ్లీ సమావేశమైంది. అయితే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రగడతో సభవాయిదా పడింది. రాత్రి ఎనిమిది గంటలకు అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇవీ చూడండి:

'న్యాయవ్యవస్థను గౌరవిస్తా.. కానీ'

ఇమ్రాన్​ ఖాన్​కు పాక్​ సుప్రీంకోర్టు షాక్​.. 'అవిశ్వాసం'పై ఓటింగ్​కు ఆదేశం

ఇమ్రాన్​కు ఆఖరి బంతి.. 'అవిశ్వాసం'పై నేడే ఓటింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.