ETV Bharat / international

అయ్ బాబోయ్.. ఎంత పెద్ద జుట్టో! ఏకంగా 5 అడుగులు.. 3సార్లు గిన్నిస్ రికార్డ్ - ప్రపంచలోనే అతిపెద్ద మహిళ అఫ్రో

ఓ మహిళ తన అఫ్రో (ఆఫ్రికన్లు చేసుకునే హెయిర్​ స్టైల్​)తో 3 సార్లు గిన్నీస్​ రికార్డు బద్దలుగొట్టింది. 24 ఏళ్ల క్రితం జట్టు పెంచడం మొదలు పెట్టిన ఆమె.. 13 ఏళ్లలో మూడు సార్లు గిన్నీస్​ టైటిల్​ కైవసం చేసుకుంది. ఇలా అందుకోవడం గర్వంగా ఉందని చెబుతోంది. ఆమె కథ ఏంటో తెలుసుకుందాం.

female afro guinnis world record
female afro guinnis world record
author img

By

Published : Apr 23, 2023, 8:36 PM IST

13 ఏళ్లలో మూడుసార్లు అతిపెద్ద మహిళా అఫ్రో (ఆఫ్రికన్లు చేసుకునే హెయిర్​ స్టైల్​) టైటిల్​ను కైవసం చేసుకుంది ఏవిన్​ దుగాస్ అనే మహిళ. అయితే, చాలా మంది నల్లజాతి మహిళలు గుర్తింపు కోసం ఇలాంటి కేశాలంకరణలు చేసుకునేవారు. వాళ్లను చూసి.. అలాగే తాను కూడా పెంచుకోవాలని 24 ఏళ్ల క్రితం నిర్ణయించుకుంది దుగాస్.​ అప్పటి నుంచి అలా పెంచడం మొదలు పెట్టింది. ఆ తర్వాత ప్రపంచ రికార్డు నమోదు చేసిన ఆమె జట్టు ఇప్పడు.. 5.41 అడుగుల చుట్టుకొలతతో, 9.84 అంగుళాల పొడవు, 10.4 అంగుళాల వెడల్పు పెరిగింది.

లుసియానాలోని న్యూ ఓర్లియాన్స్​ ప్రాంతానికి చెందిన 47 ఏళ్ల ఏవిన్​ దుగాస్​.. మొదట తాను అఫ్రోను కాకుండా నేచురల్​గా తన జుట్టును పెంచుదామనుకున్నట్లు తెలిపింది. కానీ, రసాయనాలు వాడటం ఇష్టంలేక అఫ్రో వైపు మళ్లానని చెప్పుకొచ్చింది. సోషల్​ మీడియాలో యాక్టివ్​గా​ ఉండే దుగాస్​.. తన జట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా గర్వంగా ఉందని చెబుతోంది. అయితే, అప్పుడప్పుడూ.. హెయిర్ డ్రెస్సర్​ వద్దకు వెళ్లి ట్రిమ్​ చేయించుకుంటానని తెలిపింది. అఫ్రో పెంచుకోవాలని నిర్ణయించుకున్నాక.. ఓ ప్రొఫెషనల్​ హెయిర్ స్టైలిస్ట్ వద్దకు వెళితే.. అక్కడ చేదు అనుభవం ఎదురైంది. అప్పటినుంచి దుగాస్..​ తనకు తానుగా జట్టును అలంకరించుకోవడం మొదలు పెట్టింది.

female afro guinnis world record
ఏవిన్​ దుగాస్ (pic credits Aevin Dugas)
female afro guinnis world record
ఏవిన్​ దుగాస్ (pic credits Aevin Dugas)

"జట్టుకు షాంపూ, కండీషనర్​, స్టైల్​ చేసుకునే ముందు హాట్​ ఆయిల్ ట్రీట్​మెంట్​ చేయడం ప్రారంభించాను. దాంతో పాటు సున్నితమైన జట్టు కొనల పట్ల జాగ్రత్తగా ఉంటాను. అవి కనిపించకుండా ఉండేలా.. హెయిర్​ స్టైల్​ చేసుకుంటాను. అలా చేయడం చాలా ఉపయోగపడుతుంది"

--ఏవిన్​ దుగాస్​, గిన్నీస్​ రికార్డు సాధించిన మహిళ

అఫ్రోతో బయటకు వెళ్లినప్పుడు దుగాస్​.. చుట్టుపక్కల వాళ్లందరినీ ఆకర్షిస్తుంది. అలా వెళ్లినప్పుడు తనను చాలా మంది చూస్తారని దుగాస్​ చెప్పుకొచ్చింది. అయితే, కొన్ని సార్లు తన అనుమతి లేకుండా తన అఫ్రోను తాకుతారని చెప్పింది. "నా అఫ్రోను చూసి చాలా మంది వివిధ రకాలుగా స్పందించారు. కొంతమంది బాగుందంటూ.. గట్టిగా అరుస్తారు. మరికొందరు అదే పనిగా చూస్తారు. ఇంకొందరు మీదకు వచ్చి.. జట్టును లాగుతారు." అని దుగాస్​ తన అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. అయితే, ఇలాంటి సందర్భాల్లో ఆమెకు చాలా చిరాకు పుడుతుంది. కానీ, తన అఫ్రోపై ఉన్న ప్రేమతో.. దాన్ని కాన్ఫిడెంట్​గా ప్రదర్శిస్తుంది. ఇదే రంగురంగుల్లో గుండ్రని ఆకృతితో ఉన్న జట్టులో ఉండే గర్వం.. దాని వల్ల తమని తాము ప్రేమించుకుంటారంటోంది దుగాస్​.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.