ETV Bharat / international

చైనా పైలట్లుకు బ్రిటన్​ మాజీల శిక్షణ! భారీ ప్యాకేజీలు ఇస్తున్న డ్రాగన్​ - చైనా మిలటరీ యూకే మాజీ న్యూస్​

బ్రిటన్‌ మిలటరీ మాజీ పైలట్లు చైనాకు సాయం చేస్తున్నట్లు ఆ దేశ రక్షణ శాఖే స్వయంగా ప్రకటించడం సంచలనంగా మారింది. దాదాపు 30 మంది మాజీ పైలట్లు చైనా నుంచి భారీగా సొమ్ము తీసుకొని వారి నైపుణ్యాలను.. చైనా ఆర్మీకి ధార పోస్తున్నట్లు బ్రిటన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఆకర్షణీయమైన ప్యాకేజీలతో డ్రాగన్‌.. బ్రిటన్‌ మాజీ పైలట్లను ఆకర్షిస్తున్నట్లు వెల్లడించింది. ఈ లాభదాయక చైనీస్ రిక్రూట్‌మెంట్ పథకాలను ఆపేందుకు నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.

ex uk pilots lured to help chinese military
చైనా పైలెట్లుకు బ్రిటన్​ మాజీల శిక్షణ
author img

By

Published : Oct 18, 2022, 10:39 PM IST

పశ్చిమ దేశాల యుద్ధ విమానాల లోపాలు, బలాబలాలు తెలుసుకొనేందుకు బ్రిటన్‌ మాజీ పైలట్లను చైనా వాడుకొంటోంది. దీని కోసం భారీ ప్యాకేజీలను ముట్ట జెప్తోంది.కొన్ని ప్యాకేజీల కింద ఏకంగా 2,37,911 యూరోలను కూడా ఇస్తోంది. తైవాన్‌ సంక్షోభం తలెత్తితే ఈ కీలక సమాచారం డ్రాగన్‌కు ఉపయోగపడుతుంది. ఈ సమాచారం చైనా వాయుసేన వ్యూహాలు సిద్ధం చేసుకొని సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుందని యుద్ధ నిపుణులు చెబుతున్నారు.

2019లోనే తొలిసారి చైనా ప్రయత్నాలను బ్రిటన్‌ అధికారులు గుర్తించినా.. అప్పట్లో స్వల్ప సంఖ్యలో మాజీ పైలట్లు చైనాకు వెళ్లడంతో పెద్దగా ఆందోళన చెందలేదు. కొవిడ్‌ వ్యాప్తి తర్వాత ఈ నియామకాలు మందగించాయి. కానీ ఇప్పుడు బ్రిటన్‌ మాజీ పైలట్‌ నియామకాలను డ్రాగన్‌ మళ్లీ పెంచింది. ప్రస్తుతం సర్వీసులో ఉన్న పైలట్లపై కూడా దృష్టి సారించినట్లు నిఘా వర్గాలు హెచ్చరించడం బ్రిటన్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. వీరిలో ఎవరూ చైనా ఆఫర్లకు మొగ్గు చూపలేదని తెలిపాయి.

చైనా సైన్యం చేపట్టిన బ్రిటన్‌ మాజీ పైలట్ల నియమాకాన్ని అడ్డుకునేందుకు.. నిర్ణయాత్మక చర్యలు చేపట్టినట్లు ఆ దేశం వెల్లడించింది. సుమారు 30 మంది బ్రిటన్​ మాజీ పైలట్లు.. చైనా ఆర్మీ సభ్యులకు శిక్షణ ఇచ్చేందుకు వెళ్లినట్లు భావిస్తున్నట్లు తెలిపింది. మిత్రదేశాలు ఈ చర్యపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో రంగంలోకి దిగిన రాయల్ ఎయిర్ ఫోర్స్.. రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లకు వ్యతిరేకంగా ఇప్పటికే హెచ్చరిక జారీ చేసింది. ప్రస్తుత బ్రిటన్‌ చట్టాల ప్రకారం ఈ పైలట్లను నియమించుకోవడం నేరం కాదని.. కానీ కొత్త జాతీయ భద్రతా బిల్లుతో ఈ సవాల్‌ను అధిగమిస్తామని బ్రిటన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

బ్రిటన్‌ మాజీ పైలట్లను చైనా నియమించుకోకుండా చర్యలు తీసుకొంటామని బ్రిటన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వెల్లడించారు. బ్రిటన్‌ మిలటరీ, వాయుసేన పైలట్లకు నాణ్యమైన ఫైటర్‌ జెట్లు, హెలికాప్టర్లు నడిపిన అనుభవం ఉంది. ముఖ్యంగా జాగ్వర్‌, టైఫూన్‌, హారియర్‌, టోర్నడోస్‌ వంటి ఫైటర్‌ జెట్‌లను బ్రిటన్‌ వినియోగిస్తోంది. డ్రాగన్‌కు ఈ అనుభవం అవసరం. చైనా ఉచ్చులో పడినవారిలో ఎఫ్‌-35లు నడిపిన అనుభవం ఉన్న పైలట్లు ఉండకపోవచ్చని బ్రిటన్‌ రక్షణశాఖ భావిస్తోంది. ప్రస్తుతం చైనాకు సహకరించేవారు చాలా ఏళ్ల క్రితం రిటైర్‌ అయినవారు అయి ఉండొచ్చని అంచనావేస్తోంది. మిత్రదేశాలకు చెందిన మాజీ పైలట్లకు కూడా చైనా గాలం వేసే అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారంలో దక్షిణాఫ్రికాకు చెందిన ఓ ఫ్లయింగ్‌ అకాడమీ మధ్యవర్తి పాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.