ETV Bharat / international

Crimea Bridge Attack : మరోసారి పుతిన్​ కలల వంతెనపై దాడి.. ఇద్దరు మృతి! - crimea bridge repair

Kerch Bridge Attack : పుతిన్‌ కలల వంతెనగా పేరున్న క్రిమియాలోని కెర్చ్‌ బ్రిడ్జ్‌పై మరోసారి దాడి జరిగింది. ఈ క్రమంలో వంతెన కొంత భాగం దెబ్బతింది. కెర్చ్​ బ్రిడ్జ్​పై రాకపోకలను నిలిపివేసింది రష్యా.

kerch bridge attack
kerch bridge attack
author img

By

Published : Jul 17, 2023, 12:14 PM IST

Updated : Jul 17, 2023, 12:30 PM IST

Kerch Bridge Attack : క్రిమియా ద్వీపకల్పాన్ని.. రష్యా ప్రధాన భూభాగంతో కలిపే కెర్చ్‌ వంతెనపై మరోసారి దాడి జరిగింది. కాగా.. ఈ వంతెనపై రాకపోకలను రష్యా నిలిపివేసింది. సోమవారం ఉదయం 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. రష్యా ఆధీనంలోని క్రిమియా రిపబ్లిక్‌ అధ్యక్షుడు సెర్గీ అక్సోనోవ్‌ స్పందిస్తూ.. అత్యవసర పరిస్థితి కారణంగా ఈ వంతెనపై రాకపోకలను నిలిపివేశామని చెప్పారు.

తెల్లవారుజామున రెండు పేలుళ్లు..
Kerch Bridge Collapse : సోమవారం తెల్లవారుజామున 3.00-3.30 మధ్యలో కెర్చ్‌ వంతెనపై రెండు పేలుళ్లు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ క్రమంలో రష్యా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. చాలా మంది వంతెనపై చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. పేలుళ్ల వల్ల కనీసం ఇద్దరు చనిపోయినట్లు సమాచారం. ఈ విషయాన్ని రష్యా ధ్రువీకరించలేదు. తాజా పేలుళ్ల వల్ల క్రిమియా వంతెనలో కొంత భాగం దెబ్బతిన్నట్లు గ్రేజోన్‌ అనే వాగ్నర్‌ అనుకూల టెలిగ్రామ్‌ ఛానల్‌ పేర్కొందని సీఎన్‌ఎన్‌ వెల్లడించింది. రష్యా వైపు నుంచి 145వ పిల్లర్‌ వద్ద ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

  • Multiple Explosions have been reported on the Kerch Strait Bridge between the Russian Mainland and the Crimean Peninsula, at least 1 Span of the Bridge is claimed to have Collapsed so far with the Support of several other Spans suffering Severe Damage; Civilian Casualties are… pic.twitter.com/ve5VyyvkHn

    — OSINTdefender (@sentdefender) July 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పుతిన్​ స్వయంగా ట్రక్​ నడిపి..
Crimea Bridge Length : క్రిమియాకు నిత్యావసరాల సరఫరాలో, యుద్ధ రంగంలోని రష్యా బలగాలకు ఆయుధాలను చేరవేయడంలో 19 కి.మీ. పొడవైన కెర్చ్‌ వంతెన ఎంతో కీలకం. రైళ్లు, వాహనాల రాకపోకల కోసం నిర్మించిన ఈ బ్రిడ్జ్​ ఐరోపాలోనే అత్యంత పొడవైనది. నల్ల సముద్రంపై ఆధిపత్యం కోసం తీవ్రంగా యత్నిస్తున్న రష్యా.. 2014లో క్రిమియా ద్వీపాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత సుమారు రూ.29వేల కోట్లు (360 కోట్ల అమెరికన్‌ డాలర్లు) ఖర్చుపెట్టి రోడ్డు, రైలు వంతెనను నిర్మించింది. 2018లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ స్వయంగా ట్రక్‌ నడిపి కెర్చ్​ వంతెనను ప్రారంభించారు.

2022 అక్టోబర్‌లో పుతిన్‌ 70వ జన్మదిన వేడుకలు జరిగిన మరుసటి రోజే కెర్చ్​ బ్రిడ్జిపై దాడి జరిగింది. అప్పట్లో ఉక్రెయిన్‌ అత్యాధునిక సముద్ర డ్రోన్‌లో పేలుడు పదార్థాలు నింపి ఈ వంతెన కింద పేల్చినట్లు సమాచారం. కొన్ని మైళ్ల దూరం నుంచి సెన్సర్లు, రిమోట్‌ సాయంతో ఆ దాడి చేసినట్లు భావిస్తున్నారు.

Last Updated : Jul 17, 2023, 12:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.