Congo Stampede : ఆఫ్రికా దేశమైన రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 37 మంది మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. బ్రజ్జావిల్లేలో గత వారం రోజులుగా సైన్యంలో ఖాళీగా ఉన్న 1,500 పోస్టుల భర్తీకి మిలిటరీ స్టేడియంలో నియామక ర్యాలీ జరుగుతోంది. ప్రతి రోజూ వందల సంఖ్యలో యువత నియామక ర్యాలీలో పాల్గొనేందుకు స్టేడియం బయట లైన్లలో వేచి చూస్తున్నారు. మంగళవారం ఊహించిన దాని కంటే పెద్ద సంఖ్యలో వచ్చారు. వాళ్లను అదుపు చేయడం నిర్వాహకులకు సాధ్యం కాలేదు.
ఈ క్రమంలో వాళ్లంతా ఒక్కసారిగా స్టేడియం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడం వల్ల తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 37 మంది ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. 'నియామక ర్యాలీ చివరి రోజు కావడం వల్ల చాలా మంది ముందు రోజు నుంచే మిలిటరీ స్టేడియం బయట వేచి చూస్తున్నారు. వారిలో కొందరు సహనం కోల్పోయి.. బలవంతంగా లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించడం వల్ల తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంపై విచారణ జరుపుతున్నాం' అని అధికారులు తెలిపారు.
Congo Boat Accident : కొన్నాళ్ల క్రితం ఇంధనంతో వెళుతున్న ఓ పడవ అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 16 మంది మృతి చెందారు. కాంగోలోని ఓ నదిలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో 11 మందిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన పడవ ఇందనాన్ని లోడ్ చేసుకుని.. ఎమ్బండకా నుంచి రాజధాని కిన్షాసా వరకు వెళ్తోందని అన్నారు. ఘటనపై సమాచారం అందిన వెంటనే సహయక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
Congo Landslide : ఈ ఏడాది సెప్టెంబరులో కొండచరియలు విరిగిపడి 17 మంది మృతి చెందిన ఘటన కాంగోలో జరిగింది. భారీ వర్షాల ధాటికి ఒక్కసారిగా విరిగిపడ్డ కొండచరియలు.. కొండ కింది ప్రాంతాల్లో ఉన్న నివాస గృహాలను కప్పేసాయి. దీంతో పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వారు వెల్లడించారు. వాయువ్య మంగల ప్రావిన్స్‌లోని లిసాల్ పట్టణంలో.. కాంగో నది తీరప్రాంత పరిసరాల్లో ఈ ఘటన జరిగింది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.