ETV Bharat / international

పటిష్ఠ బందోబస్తు మధ్య బంగ్లా పోలింగ్​- విపక్షం బాయ్​కాట్​తో నాలుగోసారీ హసీనానే ప్రధాని! - bangladesh riots today

Bangladesh Election 2024 : పటిష్ఠ బందోబస్తు మధ్య బంగ్లాదేశ్‌లో 12వ సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ను ఆదివారం చేపట్టారు అధికారులు. ఎన్నికలను బహిష్కరిస్తూ ప్రధాన విపక్షం బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ దూరంగా ఉంటున్న నేపథ్యంలో నాలుగోసారీ కూడా షేక్‌ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్‌ పార్టీదే గెలుపని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Bangladesh Election 2024
Bangladesh Election 2024
author img

By PTI

Published : Jan 7, 2024, 10:37 AM IST

Bangladesh Election 2024 : బంగ్లాదేశ్‌లో 12వ సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ను ఆదివారం చేపట్టారు అధికారులు. తాజాగా తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. 42,000 పోలింగ్ స్టేషన్లలో దాదాపు 12 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రధాన విపక్షం బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ ఎన్నికలకు దూరంగా ఉంటున్న నేపథ్యంలో నాలుగోసారీ కూడా షేక్‌ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్‌ పార్టీదే గెలుపని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అంతకుముందు ప్రధానమంత్రి షేక్‌ హసీనా ఢాకాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె, దేశాభివృద్ధికి ప్రజాస్వామ్యం కీలకమని వ్యాఖ్యానించారు. ప్రజలు నిర్భయంగా ఓటేసే వాతావరణాన్ని కల్పించామని చెప్పారు. ప్రధాన విపక్షం BNP ఎన్నికలను బహిష్కరించిన నేపథ్యంలో ఆ పార్టీని ఉగ్రవాద సంస్థగా అభివర్ణించారు.

"బంగ్లాదేశ్‌ సార్వభౌమ, స్వాతంత్ర్య దేశం. జనాభా చాలా ఎక్కువ. ప్రజల ప్రజాస్వామ్య హక్కులను వ్యవస్థాపితం చేశాం. ఆ ప్రజాస్వామ్య వ్యవస్థ సజావుగా కొనసాగాలని కోరుకుంటున్నాను. లేదంటే దేశ అభివృద్ధి సాధ్యం కాదు. సుదీర్ఘ కాలంగా 2009- 2023 వరకు మేం అధికారంలో ఉండటం వల్లే బంగ్లాదేశ్‌ ఈ స్థాయికి చేరుకుంది."

--షేక్‌ హసీనా, ప్రధానమంత్రి

'భారత్​ లాంటి మిత్రదేశం ఉండడం మా అదృష్టం'
ఈ సందర్భంగా భారత్‌కు ధన్యవాదాలు తెలిపారు ప్రధానమంత్రి హసీనా. "భారత్‌ వంటి నమ్మకమైన మిత్రదేశం ఉండడం మా అదృష్టం. బంగ్లాదేశ్‌ విముక్తి పోరాటంలో భారత్​ మాకు అండగా ఉంది. 1975 తర్వాత మా కుటుంబం మొత్తాన్ని కోల్పోయినప్పుడు ఆశ్రయమిచ్చింది. ఈ సందర్భంగా భారత ప్రజలకు నా శుభాకాంక్షలు" అని హసీనా తెలిపారు.

రెండు స్కూళ్లు, 14 పోలింగ్ స్టేషన్లకు నిప్పు
మరోవైపు దాదాపు 17 కోట్ల జనాభా ఉన్న బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలను బహిష్కరిస్తూ BNP బంద్‌కు పిలుపునివ్వటం వల్ల శనివారం పలు హింసాత్మక ఘటనలు జరిగాయి. రెండు పాఠశాలలు సహా సుమారు 14 పోలింగ్ కేంద్రాలకు నిప్పు పెట్టారు అందోళనకారులు. ప్రయాణికుల రైలుకు దుండగులు నిప్పుపెట్టడం వల్ల నలుగురు ప్రయాణికులు సజీవదహనమయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు.

ఎన్నికలకు ముందు బంగ్లాదేశ్​లో హింస- రైలుకు నిప్పు- నలుగురు సజీవదహనం

'హక్కులు' లేని భారతీయులు! ఇండియా మ్యాప్​లో కనిపించని గ్రామాల గురించి తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.