ప్రాణం అనేది ప్రకృతికి సంబంధించిన విషయం. ఇదొక ప్రజా ఉద్యమం. అన్ని మతాల వారు ఈ నిరసనలో పాల్గొన్నారు. గర్భ విచ్ఛిత్తికి మేము వ్యతిరేకం. పార్లమెంట్ సభ్యులకు ఈ విషయం తెలిసేలా చేస్తాం.-కార్లొస్ లొరెన్జ్, నిరసనకారుడు
గర్భ విచ్ఛిత్తికి చట్టబద్ధత కల్పించేందుకు 2018లో బిల్లు ప్రవేశపెట్టింది అర్జెంటీనా ప్రభుత్వం. దిగువ సభ ఆమోదం పొందిన ఆ బిల్లు... ఎగువసభలో తిరస్కరణకు గురైంది. ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ప్రభుత్వ బిల్లును సమర్థిస్తూ గత నెలలో వేలాది మంది బ్యూనస్ ఏర్స్లో ఆందోళనకు దిగారు. ఇప్పుడు వారికి వ్యతిరేకంగా మరో వర్గం నిరసన చేపట్టింది.
ప్రస్తుతం అర్జెంటీనాలో అత్యాచార కేసులు లేదా గర్భం వల్ల మహిళ ప్రాణాలకు హానీ ఉన్న సందర్భాల్లోనే గర్భవిచ్ఛితికి అనుమతి ఉంది.