ETV Bharat / international

పాక్​లో బాంబు పేలుడు.. ముగ్గురు చైనీయులు మృతి.. పక్కా ప్లాన్​తోనే! - చైనీయులపై దాడి

Pakistan Blast News: పాకిస్థాన్​లోని కరాచీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా వీరిలో ముగ్గురు చైనీయులు ఉన్నారు. చైనీయులే లక్ష్యంగా ఈ దాడి జరిగనట్లు అధికారులు భావిస్తున్నారు.

blast
చైనీయులు
author img

By

Published : Apr 26, 2022, 6:11 PM IST

Updated : Apr 26, 2022, 10:04 PM IST

Pakistan Blast News: పాకిస్థాన్​లోని కరాచీ యూనివర్సిటీ పరిధిలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు చైనా దేశస్థులు ఉండటం గమనార్హం. ఆత్మాహుతి దాడి కారణంగా ఈ దుర్ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఇది వారిని టార్గెట్​ చేసి జరిపిన పేలుడు అని భావిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో మృతులు వ్యాన్​లో ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. ఈ దాడికి తాము బాధ్యత వహిస్తున్నట్లు నిషేధిత తీవ్రవాద సంస్థ బలూచిస్థాన్​ లిబరేషన్​ ఆర్మీ (బీఎల్​ఏ) ప్రకటించింది. యూనివర్సిటీలోని చైనా నిర్మించిన కన్​ఫుసియస్​ ఇన్​స్టిట్యూట్​ వద్ద పేలుడు జరిగింది. స్థానికులకు చైనీస్​ నేర్పించడం కోసం చైనా ఇదివరకు ఈ ఇన్​స్టిట్యూట్​ను ఏర్పాటు చేసింది.

మృతులను.. ​ఇన్​స్టిట్యూట్ డైరెక్టర్​ హువాంగ్​ గిపింగ్​, డింగ్​ ముపెంగ్​, చెన్​ సా, ఖలీద్​లుగా గుర్తించారు అధికారులు. ఈ ఘటనలో వాంగ్​ యుగింక్​, హమీద్​ అనే మరో ఇద్దరు గాయపడ్డారని అధికారులు తెలిపారు. మరో ముగ్గురి పరిస్థితి విషయంగా ఉందన్నారు. దాడి జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీ ప్రకారం.. బుర్ఖా ధరించిన ఓ మహిళ ​చైనీయులు ప్రయాణిస్తున్న వ్యాన్​ ఇన్​స్టిట్యూట్​ ఎంట్రెన్స్​​ వద్దకు రాగానే ఆత్మాహుతికి పాల్పడింది. నిందితురాలిని షారీ బలూచ్​ అలియాస్ బ్రంష్​గా గుర్తించారు అధికారులు. ఈ ఘటనపై స్పందించిన పాక్​ ప్రధాని షెహ్​బాజ్​ షరీఫ్.. మృతుల కుటుంబాలకు​ సంతాపం ప్రకటించారు. ఈ దాడికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరోవైపు.. రష్యా రాజధాని మాస్కోలోని ఓ స్కూల్​లో జరిగిన కాల్పులు స్థానికంగా కలకలం రేపాయి. పాఠశాలలోకి చొరబడిన ఓ సాయుధుడు కాల్పులు జరిపాడు. ఈ క్రమంలో ఇద్దరు చిన్నారులు సహా ఓ మహిళా ఉద్యోగి ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత సాయుధుడు తనకు తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో మరో ఉద్యోగి గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి : భారత్‌తో సత్సంబంధాలను కోరుకుంటున్నాం: షెహబాజ్‌ షరీఫ్‌

Last Updated : Apr 26, 2022, 10:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.