Bangladesh Train Bus Accident: బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద ఓ మినీ బస్సును వేగంగా దూసుకొస్తున్న ఓ రైలు ఢీకొట్టింది. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో ఏడుగురు విద్యార్థులు సహా 11 మంది అక్కడిక్కడే మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాలను వెలికితీశారు. క్షతగాత్రులను చిట్టగాంగ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.
ఓ కోచింగ్ సెంటర్ ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి ప్రయాణిస్తున్న మినీబస్సును ఢాకా వైపు వెళ్తున్న ప్రోవతి ఎక్స్‌ప్రెస్ ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. మరణించినవారిలో ఏడుగురు ఒకే వయస్సు గల విద్యార్థులు ఉన్నారని, నలుగురు ఉపాధ్యాయులు కూడా ఉన్నారని చెప్పారు. మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు.
ఇవీ చదవండి: 'జైలుపై ఉక్రెయిన్ బాంబు దాడి.. 40 మంది మృతి.. అందరూ సొంతవాళ్లే!'
'నిప్పుతో చెలగాటం వద్దు.. అది మీకే ప్రమాదం'.. అమెరికాకు జిన్‌పింగ్ హెచ్చరిక