ప్రపంచ దేశాలపై కరోనా మహమ్మారి మహావిలయం కొనసాగుతూనే ఉంది. శుక్రవారం ఏకంగా 5.54 లక్షల మందికి కొత్తగా వైరస్ సోకింది. 9 వేలకుపైగా మంది వైరస్‌కు బలయ్యారు. ఓ వైపు కరోనా కొత్త స్ట్రెయిన్ ప్రబలటమూ ప్రజల్లో ఆందోళన పెంచుతోంది. అయితే.. కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరగటం ఊరట కలిగిస్తోంది. అమెరికాతో పాటు బ్రిటన్‌లో కొత్త కేసుల ఉద్ధృతి అధికంగా ఉంది.
మొత్తం కేసులు: 84,354,341
మరణాలు: 1,834,467
కోలుకున్నవారు: 59,622,576
క్రియాశీల కేసులు: 22,897,298
- అగ్రరాజ్యం అమెరికాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. శుక్రవారం కొత్తగా 1, 65,126 కేసులు నమోదయ్యాయి. 2 వేలకుపైగా మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 2 కోట్లు దాటింది. 3.56 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
- యూకేలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ఓ వైపు కొత్త స్ట్రేయిన్‌తో మళ్లీ లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తుండగా.. కొత్త కేసులూ పెరుగుతున్నాయి. శుక్రవారం కొత్తగా 53,285 మంది వైరస్ సోకటం ఆందోళన కలిగిస్తోంది. 613 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 25 లక్షలు దాటింది.
- అమెరికా, బ్రిటన్ తర్వాత రష్యాలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం కొత్తగా 27,039 కేసులు వెలుగుచూశాయి. 536 మంది వైరస్‌కు బలయ్యారు. మొత్తం కేసుల సంఖ్య 32 లక్షలకు చేరువైంది.
- బ్రెజిల్, ఇటలీ, భారత్, ఫ్రాన్స్‌లలో రోజుకు 20 వేల వరకు కొత్త కేసులు వస్తున్నాయి. టర్కీ, జర్మనీ, కొలంబియా, మెక్సికో, పోలాండ్, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో 10వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కేసుల వివరాలు ఇలా..
దేశం | మొత్తం కేసులు | మరణాలు |
అమెరికా | 20,616,428 | 356,428 |
బ్రెజిల్ | 7,700,578 | 195,441 |
రష్యా | 3,186,336 | 57,555 |
ఫ్రాన్స్ | 2,639,773 | 64,765 |
యూకే | 2,542,065 | 74,125 |
టర్కీ | 2,220,855 | 21,093 |
ఇటలీ | 2,129,376 | 74,621 |
స్పెయిన్ | 1,936,718 | 50,837 |