ETV Bharat / international

కరోనాపై 116 ఏళ్ల బామ్మ విజయం - కరోనాను జయించిన ప్రపంచ రెండో కురువృద్ధురాలు!

వందేళ్లు జీవిస్తేనే గొప్పగా భావించే నేటి రోజుల్లో.. 116 ఏళ్లలోనూ కరోనాను ఓడించారు ఓ ఫ్రెంచ్​ బామ్మ. గత నెలలో కరోనా బారినపడ్డ సిస్టర్​ ఆండ్రే.. మూడు వారాలపాటు వైరస్​తో పోరాడి, ఇటీవలే కోలుకున్నారు.

World second-oldest person survives COVID-19 at age 116 in French
కరోనాను జయించిన ప్రపంచ రెండో కురువృద్ధురాలు!
author img

By

Published : Feb 10, 2021, 3:49 PM IST

ప్రపంచ రెండో అత్యంత వృద్ధురాలిగా భావిస్తోన్న 116 ఏళ్ల సన్యాసిని సిస్టర్​ ఆండ్రే కరోనాను జయించారు. దక్షిణ ఫ్రెంచ్​ నగరమైన టౌలాన్​లోని ఓ సంరక్షణ కేంద్రంలో ఉంటున్న ఆమెకు.. జనవరిలో కరోనా సోకింది. మూడు వారాల చికిత్స అనంతరం.. ఆమెకు కొవిడ్ పరీక్షల్లో నెగెటివ్​ వచ్చింది.

110 లేదా అంతకంటే ఎక్కువ వయసు కలిగిన వారి వివరాలను సేకరించే 'జెరొంటాలజీ రీసెర్చ్​ గ్రూప్'​ ప్రకారం.. లుసైల్​ రాండన్​-సిస్టర్​ ఆండ్రే.. అధిక వయస్కుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. ఈమె 1904 ఫిబ్రవరి 11న జన్మించినట్టు ఈ​ రీసెర్చ్​ గ్రూప్​ ధ్రువీకరించింది. ఈ నెల 11న(గురువారం) ఆండ్రే 117వ పడిలోకి అడుగుపెట్టనున్నారు.

కరోనా సోకినా...

దివ్యాంగురాలైన సిస్టర్​ ఆండ్రే ప్రస్తుతం చక్రాల కుర్చీకి పరిమితమయ్యారు. కరోనా సోకినప్పుడు తాను ఎలాంటి ఆందోళనకు గురికాలేదని చెప్పారామె. అయితే.. మహమ్మారి బారినపడిన తర్వాత ఆమె తోటివారి గురించే ఎక్కువగా ఆలోచించేవారని సన్యాసి సంరక్షణ కేంద్ర కమ్యూనికేషన్స్​ మేనేజర్​ డేవిడ్​ టావెల్ల తెలిపారు.

గత నెలలో ఆ సంరక్షణ కేంద్రంలో కరోనా పరీక్షలు నిర్వహించగా.. 88 మందిలో 81 మందికి పాజిటివ్​గా తేలింది. వారిలో సిస్టర్​ ఆండ్రే ఒకరు. మిగిలిన వారిలో 10 మంది కొవిడ్​కు బలైనట్టు సమాచారం.

ఇదీ చదవండి: ఇక ప్రపంచ కురువృద్ధుడిగా బిట్రన్​వాసి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.