ETV Bharat / international

అసమానతల భారతం- ఒక్క శాతం జనాభా వద్దే 22% ఆదాయం! - లింగ అసమానతలు ఇండియా

World inequality report 2022: ప్రపంచంలోనే తీవ్రమైన అసమానతలు కలిగిన దేశంగా భారత్ నిలిచింది. 22 శాతం జాతీయాదాయం దేశంలోని ఒక శాతం ప్రజల వద్దే ఉందని ఓ నివేదికలో తేలింది. కిందిస్థాయిలో ఉన్న 50 శాతం జనాభా సంపద వాటా కేవలం 13 శాతంగా ఉందని నివేదిక వెల్లడించింది. భారత్​లో లింగ అసమానతలు కూడా తీవ్రంగా ఉన్నాయని స్పష్టం చేసింది.

India unequal wealth distribution
India unequal wealth distribution
author img

By

Published : Dec 8, 2021, 12:49 PM IST

World inequality report 2022: దేశంలో ఆర్థిక అసమానతలు తీవ్రంగా ఉన్నట్లు 'వరల్డ్ ఇనీక్వాలిటీ రిపోర్ట్​ 2022'లో వెల్లడైంది. జాతీయాదాయంలో 22 శాతం.. దేశంలోని ఒక శాతం ప్రజల వద్దే ఉందని తేలింది. ఆదాయంలో 13 శాతం మాత్రమే.. దేశంలో కిందిస్థాయిలో ఉన్న 50 శాతం మంది ప్రజల వద్ద ఉందని నివేదిక వెల్లడించింది. 'వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్' కో-డైరెక్టర్ లూకాస్ ఛాన్సెల్, ఫ్రెంచ్ ఆర్థికవేత్త థామస్ పికెటీ సహా పలువురు నిపుణులు కలిసి ఈ నివేదిక రూపొందించారు.

India unequal Wealth distribution:

World inequality report India:

ప్రపంచంలో అసమానతలు తీవ్రంగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటని నివేదిక వెల్లడించింది. భారత్​లోని వయోజనుల సగటు వార్షికాదాయం రూ.2,04,200గా ఉందని తెలిపింది. కిందిస్థాయిలో ఉన్న 50 శాతం మంది ప్రజలు వార్షికంగా రూ.53,610 మాత్రమే సంపాదిస్తున్నారని.. తొలి 10 శాతంలో ఉన్న జనాభా మాత్రం 20 రెట్లు అధికంగా(రూ.11,66,520) ఆర్జిస్తున్నారని వివరించింది.

"తొలి పది శాతం జనాభా వద్ద 57 శాతం, ఒక శాతం జనాభా వద్ద 22 శాతం జాతీయాదాయం పోగుపడి ఉంది. కిందిస్థాయిలో ఉన్న 50 శాతం జనాభా వాటా 13 శాతమే. సంపన్నమైన ఉన్నతవర్గం కలిగిన అత్యంత అసమాన పేద దేశంగా భారత్ నిలిచింది."

-నివేదిక

Average household wealth India

నివేదిక ప్రకారం భారత్​లోని కుటుంబాల సగటు సంపద రూ.9,83,010గా ఉంది. 1980వ దశకంలో అమలు చేసిన సరళీకృత విధానాలు.. భారత్​ను ప్రపంచంలోనే అత్యంత అసమాన దేశంగా మార్చాయని నివేదిక అభిప్రాయపడింది. ఆదాయ అసమానతలు తీవ్రంగా పెరిగాయని పేర్కొంది.

Gender inequality in India

ఆదాయంలోనే కాక లింగ అసమానతలు సైతం భారత్​లో తీవ్రంగా ఉందని నివేదిక స్పష్టం చేసింది. మొత్తం ఆదాయంలో దేశంలోని మహిళా కార్మికుల వాటా 18 శాతమేనని తెలిపింది. ఇది ఆసియా సగటు(21) కన్నా తక్కువ అని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా పశ్చిమాసియా దేశాల సగటు మాత్రమే(15) భారత్​ కన్నా తక్కువగా ఉందని తెలిపింది.

Inequalities in the world

1980 తర్వాత ఆదాయ, సంపద అసమానతలు పెరుగుతూనే ఉన్నాయని నివేదిక పేర్కొంది. సరళీకృత విధానాలు ఒక్కో దేశంలో ఒక్కో రకంగా ప్రభావం చూపించాయని తెలిపింది.

"అసమానతలు అన్ని దేశాల్లో ఒకే రకంగా లేవు. అమెరికా, రష్యా, భారత్ వంటి దేశాల్లో అసమానతలు తీవ్రస్థాయిలో పెరిగాయి. చైనా, ఐరోపా దేశాల్లో అసమానతలు కొంతవరకు తక్కువగానే పెరిగాయి. ఆర్థిక, వాణిజ్య రంగాల్లో ప్రపంచీకరణ మొదలైన మూడు దశాబ్దాల తర్వాత కూడా అసమానతలు తీవ్రంగా ఉంటున్నాయి. 20వ శతాబ్దం నాటి సామ్రాజ్యవాద కాలంలో ఏ స్థాయిలో ఉండేవో.. ఇప్పుడు సైతం అదే స్థాయిలో అసమానతలు ఉన్నాయి."

-నివేదిక

కొవిడ్ సమయంలో సంపన్న, పేద వర్గాల మధ్య అసమానతలు మరింత తీవ్రమయ్యాయని నివేదిక రూపకర్త లూకాస్ ఛాన్సెల్ పేర్కొన్నారు. ప్రభుత్వాలు కలగజేసుకొని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ధనిక దేశాల్లో ఈ అసమానతలు భారీగా పెరగలేదన్నారు. పేద దేశాల్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని చెప్పారు. పేదరికంపై పోరాటంలో సోషల్ స్టేటస్ పాత్ర ఎంత ముఖ్యమో ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని అన్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.