ETV Bharat / international

కరోనా నుంచి  కోలుకున్నవారికీ మళ్లీ వైరస్​ ముప్పు! - corona global death toll

కరోనా వైరస్​ నుంచి కోలుకున్న వారు మళ్లీ వ్యాధి బారిన పడరని తెలిపేందుకు ఎలాంటి ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు 2లక్షల మందికిపైగా పొట్టనబెట్టుకున్న మహమ్మారి పట్ల ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

who-warns-over-virus-immunity
కరోనా నుంచి  కోలుకున్నవారికీ మళ్లీ వైరస్​ ముప్పు!
author img

By

Published : Apr 26, 2020, 6:44 AM IST

కరోనా నుంచి కోలుకున్నవారికి మరోసారి మహమ్మారి ముప్పు లేదనడానికి ప్రస్తుతం ఎటువంటి ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపింది. కరోనా నుంచి బయటపడ్డవారికి కొన్నిచోట్ల ఇమ్యూనిటీ పాస్‌పోర్ట్‌లు, రిస్క్‌ ఫ్రీ సర్టిఫికెట్స్‌ ఇవ్వడంపై ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తరహా నిర్ణయాలతో వైరస్‌ మరింత విస్తరించే ప్రమాదం ఉందని పేర్కొంది.

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 2,00,000కు పైగా ప్రాణాలను బలిగొంది. 29 లక్షల మంది వరకు సోకింది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది డబ్ల్యూహెచ్‌ఓ.

వైరస్​కు వ్యాక్సిన్​ను కనుగొనేందుకు ప్రపంచదేశాల అధినేతలతో కలిసి పరిశోధనలు వేగవంతం చేసింది ఐక్యరాజ్యసమితి.

ఇదీ చూడండి: ప్రపంచంపై కరోనా పంజా.. 28 లక్షలు దాటిన కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.