భారత్‌లో వెలుగుచూసిన డెల్టా వేరియంట్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఐరోపా విభాగం డైరెక్టర్ డాక్టర్ హాన్స్ క్లూగ ఆందోళన వ్యక్తం చేశారు. ఐరోపా దేశాల్లో ఈ వేరియంట్ విస్తృతంగా వ్యాపించే అవకాశం ఉందని హెచ్చరించారు. కొన్ని రకాల వ్యాక్సిన్లను ఎదిరించి మరీ వైరస్ ప్రబలుతోందని అన్నారు. 60 ఏళ్లు పైబడిన జనాభా వైరస్‌కు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని చెప్పారు.
మరోవైపు, ఆల్ఫా, డెల్టా కొవిడ్ వేరియంట్లు శ్రీలంకలో వెలుగుచూశాయి. తొమ్మిది వేర్వేరు ప్రదేశాల్లో వీటిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. 80 మందికి ఆల్ఫా వేరియంట్ సోకగా.. క్వారంటైన్లో ఉన్న ఒక వ్యక్తికి డెల్టా రకం కొవిడ్ సోకిందని చెప్పారు. రెండు డోసులు తీసుకున్న కొందరు వైద్య సిబ్బందిలోనూ డెల్టా కేసులు గుర్తించినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: ఆ వయసు పిల్లలకు మాస్కు అవసరం లేదా?