ETV Bharat / international

'రెమ్​డెసివిర్​తో ఎలాంటి ప్రయోజనం లేదు'

author img

By

Published : Nov 20, 2020, 5:37 PM IST

గిలీద్​ సైన్సెస్​కు చెందిన యాంటీ వైరల్​ ఔషధం రెమ్​డెసివిర్​.. కరోనా రోగులపై ఎలాంటి ప్రభావం చూపట్లేదని మరోసారి స్పష్టం చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ). రోగులు కోలుకుంటున్నట్లు, మరణాల రేటును తగ్గిస్తున్నట్లు ఎలాంటి ఆధారాలు కనిపించలేదని డబ్ల్యూహెచ్​ఓ నియమించిన కమిటీ తేల్చిచెప్పింది.

WHO warns against Remdesivir for COVID-19 treatment
'రెమ్​డెసివిర్​తో ఎలాంటి ప్రయోజనం లేదు'

కరోనా రోగులకు చికిత్స అందించేందుకు యాంటీ వైరల్​ డ్రగ్​ రెమ్​డెసివిర్​ను ఉపయోగించవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) మరోసారి స్పష్టం చేసింది. వ్యాధి తీవ్రత ఎంత ఉన్నా.. ఇది ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు స్పష్టమైన ఆధారాలు లేవని డబ్ల్యూహెచ్​ఓ గైడ్​లైన్​ డెవలప్​మెంట్​ గ్రూప్​ ప్యానెల్​ తేల్చిచెప్పింది.

ఆస్పత్రుల్లో చేరిన దాదాపు 7 వేల మంది రోగులపై రెమ్​డెసివిర్​ ట్రయల్స్​ నిర్వహించారు. అయితే.. వీరిలో రెమ్​డెసివిర్​ ఎలాంటి సానుకూల ప్రభావాలు చూపలేదని తేలినట్లు ప్యానెల్​ తేల్చింది. మరణం నుంచి బయటపడేయడానికి ఈ మందు దోహదం చేయడం లేదని పేర్కొంది. సంబంధిత కథనం.. బ్రిటిష్​ మెడికల్​ జర్నల్​లో ప్రచురితమైంది.

''రెమ్​డెసివిర్​ వల్ల ఏవైనా ప్రయోజనాలు ఉన్నట్లయితే.. చాలా తక్కువ. అయితే.. అది ప్రతికూల ప్రభావం చూపించే అవకాశమే ఎక్కువ.''

- డబ్ల్యూహెచ్​ఓ గైడ్​లైన్​ డెవలప్​మెంట్​ గ్రూప్​ ప్యానెల్​

కొవిడ్ -19 బాధితుల చికిత్సలో వాడేందుకు మొదట అనుమతి పొందిన ఔషధం రెమ్​డెసివిరే కావడం గమనార్హం. అత్యవసర వినియోగానికి అమెరికాకు చెందిన ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ మే నెలలోనే అనుమతినిచ్చింది. ఐరోపా సమాఖ్య సహా ఇతర దేశాల్లోనూ దీనిని వినియోగిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.