ETV Bharat / international

ఒమిక్రాన్​తో కరోనా కేసుల సునామీ: డబ్ల్యూహెచ్ఓ - కరోనా హెచ్చరిక డబ్ల్యూహెచ్ఓ

WHO warning Omicron: ఒమిక్రాన్ వేరియంట్​తో కరోనా కేసులు సునామీలా విరుచుకుపడతాయని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. ఒమిక్రాన్, డెల్టా ఉమ్మడి ముప్పుగా పరిణమించాయని పేర్కొంది. కలిసి ఎదుర్కోకపోతే.. వైరస్ మరింత వ్యాపిస్తుందని అప్రమత్తం చేసింది.

who chief
who chief
author img

By

Published : Dec 30, 2021, 10:43 AM IST

WHO warning Omicron: ప్రపంచంపై విరుచుకుపడుతున్న ఒమిక్రాన్ వేరియంట్​పై ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఒమిక్రాన్​తో కరోనా కేసులు సునామీలా విరుచుకుపడతాయని హెచ్చరించింది. డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లు ఉమ్మడి ముప్పుగా ఏర్పడ్డాయని పేర్కొంది. ఈ రెండు వేరియంట్లు ఒకేసారి వ్యాప్తి చెందుతుండటం వల్ల.. కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయని తెలిపింది.

Covid cases Tsunami

ఆస్పత్రి చేరికలు, మరణాలు సైతం అధికంగా నమోదవుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ పేర్కొన్నారు. ఉమ్మడిగా దీన్ని ఎదుర్కోకపోతే.. వైరస్ మరింతగా వ్యాపించి వైద్య వ్యవస్థను ప్రమాదంలోకి నెడుతుందని అన్నారు.

"వైద్య వ్యవస్థపై ఒత్తిడికి పెద్ద సంఖ్యలో కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చేరడం మాత్రమే కారణం కాదు. హెల్త్ వర్కర్లు చాలా మంది వైద్యం చేస్తూ ఇన్ఫెక్షన్​కు గురవుతున్నారు. చాలా ప్రాంతాల్లో సిబ్బంది కొరత ఏర్పడుతోంది. వ్యాక్సిన్ తీసుకోని వారిలోనే వైరస్ ఎక్కువగా వ్యాపిస్తోంది. మరణించే ముప్పు వారిలోనే అధికంగా ఉంటోంది."

-టెడ్రోస్ అధనోమ్, డబ్ల్యూహెచ్ఓ చీఫ్

2022లో కరోనా తీవ్ర దశ నుంచి ప్రపంచం బయటపడే అవకాశం ఉందని ఇదివరకు అంచనా వేసిన డబ్ల్యూహెచ్ఓ... ఇందుకు టీకా సమానత్వం సాధించాలని అభిప్రాయపడింది. ప్రతి దేశంలో వ్యాక్సినేషన్ రేటు 2021 చివరి నాటికి జనాభాలో 40 శాతం, 2022 జూన్ నాటికి 70శాతం పూర్తి కావాలని నిర్దేశించుకుంది. అయితే, 194 దేశాల్లో 92 సభ్య దేశాలు 40 శాతం టార్గెట్​కు దూరంగా ఉండిపోయాయని టెడ్రోస్ తాజాగా వెల్లడించారు. ధనిక దేశాల తీరుతో...పేద దేశాలకు టీకాలు, వైద్య పరికరాలు అందకుండా పోయాయని అన్నారు. 2022లోనైనా 70శాతం టార్గెట్​ను అందుకునేలా నూతన సంవత్సరంలో తీర్మానించుకోవాలని పిలుపునిచ్చారు.

తీవ్ర స్థాయికి ఒమిక్రాన్ అప్పుడే...

Omicron peak stage: మరోవైపు, అమెరికాలో జనవరి చివరి నాటికి ఒమిక్రాన్ కేసుల సంఖ్య తీవ్ర స్థాయికి చేరే అవకాశం ఉందని ఆ దేశ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ పేర్కొన్నారు. 'దేశ జనాభా, పరిమాణం, వ్యాక్సినేషన్ రేటు ఆధారంగా చూస్తే.. రెండు మూడు వారాల్లో- అంటే జనవరి చివరి నాటికి కేసులు తీవ్ర స్థాయికి చేరుకుంటాయి' అని ఓ వార్తా ఛానెల్​కు వివరించారు.

US covid cases

అమెరికాలో ఒక్కరోజులోనే 4,65,449 మందికి ఇన్ఫెక్షన్ సోకినట్లు తేలింది. 1,674 మంది మరణించారు. దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య.. 54,656,645కు చేరింది. మరణాల సంఖ్య 844,169కు పెరిగింది.

World covid cases

అటు, ప్రపంచవ్యాప్తంగానూ కొవిడ్ కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. అన్ని దేశాల్లో కలిపి ఒక్కరోజే 16 లక్షల కేసులు బయటపడ్డాయి. 7 వేలకు పైగా బాధితులు మరణించారు.

ఇదీ చదవండి: అమెరికాలో కరోనా కల్లోలం- ఒక్కరోజే 4.65 లక్షల కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.