ETV Bharat / international

G20 summit 2021: సరఫరా గొలుసుపై కీలక చర్చ.. పాల్గొన్న ప్రధాని మోదీ

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సరఫరా గొలుసులో తలెత్తుతున్న సమస్యలపై జీ-20 (G20 latest news) దేశాలు చర్చించాయి. వైవిధ్యమైన సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్​ అభిప్రాయపడ్డారు. ఈ సమావేశానికి ప్రధాని మోదీ (PM Modi in italy) హాజరయ్యారు.

G20 update news
జీ20 సదస్సు
author img

By

Published : Nov 1, 2021, 12:49 AM IST

ప్రపంచదేశాల మధ్య సరఫరా గొలుసును వైవిధ్యంగా ఏర్పాటు చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్​ అన్నారు. దీంతో ఒకే విధమైన పంపిణీ వ్యవస్థపై ఆధారపడితే.. అంతరాయాలు తలెత్తినప్పుడు ఇబ్బందిపడకుండా ఉంటామని చెప్పారు. సైబర్​క్రైమ్​తో సహా మానవ నిర్మిత బెదిరింపుల నుంచి ఈ వ్యవస్థ సురక్షింతంగా ఉండేలా చూసుకోవాలని కోరారు. జీ20 శిఖరాగ్ర సదస్సులో (G20 latest news) భాగంగా ఆదివారం సప్లై చైన్ రీసైలెంట్​ సమ్మిట్​లో ఈ మేరకు మాట్లాడారు. ఇటలీ పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi in italy) కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఓడరేవుల్లో ప్రాసెసింగ్ సమయాన్ని తగ్గించడం ద్వారా సరఫరా వేగాన్ని పెంచుతున్నట్లు బైడెన్ తెలిపారు. ఈ విషయంలో అమెరికా భాగస్వామ్య దేశాలకు ప్రత్యేక నిధులను కూడా కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 'డబ్ల్యూహెచ్​ఓ బలోపేతానికి జీ20 దేశాల అంగీకారం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.