ETV Bharat / international

హెర్డ్​ ఇమ్యూనిటీపై డబ్ల్యూహెచ్​ఓ కీలక వ్యాఖ్యలు - టెడ్రోస్​ అధనోమ్

కరోనా వైరస్​ను అరికట్టేందుకు హెర్డ్​ ఇమ్యూనిటీ ఒక వ్యూహంగా భావించటం సరైంది కాదని హెచ్చరించారు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేత టెడ్రోస్​ అధనోమ్​. వైద్య నిపుణులు వ్యాక్సిన్​ ద్వారానే హెర్డ్​ ఇమ్యూనిటీ సాధించాలని లక్ష్యంగా ఉన్నారని, ప్రజల్లోకి భయంకరమైన వైరస్​ను వ్యాప్తి చెందించటం పూర్తిగా అనైతికమని పేర్కొన్నారు.

WHO
హెర్డ్​ ఇమ్యూనిటీపై డబ్ల్యూహెచ్​ఓ కీలక వ్యాఖ్యలు
author img

By

Published : Oct 13, 2020, 5:10 AM IST

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు హెర్డ్​ ఇమ్యూనిటీ ఒక వాస్తవిక వ్యూహం అనే ఆలోచనను వ్యతిరేకించారు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేత టెడ్రోస్​ అధనోమ్​. అటువంటి ప్రతిపాదనలు పూర్తిగా అనైతికమని పేర్కొన్నారు. వైద్య నిపుణులు వ్యాక్సిన్​ ద్వారానే హెర్డ్​ ఇమ్యూనిటీని సాధించాలనే లక్ష్యంతో పని చేస్తున్నారని మీడియా సమావేశంలో పేర్కొన్నారు టెడ్రోస్​.

" తట్టు వంటి అత్యంత ప్రమాదకర అంటువ్యాధులను అరికట్టేందుకు హెర్డ్​ ఇమ్యూనిటీ పొందడానికి జనాభాలో 95 శాతం మందికి రోగనిరోధక శక్తి ఉండాలి. హెర్డ్​ ఇమ్యూనిటీని వైరస్​ నుంచి ప్రజలను రక్షించటం ద్వారా సాధించవచ్చు. కానీ, వైరస్​ వ్యాప్తికి గురిచేయటం ద్వారా కాదు. ప్రజారోగ్య చరిత్రలో ఎన్నడూ హెర్డ్​ ఇమ్యూనిటీని ఓ మహమ్మారిని అరికట్టేందుకు ఒక వ్యూహంగా ఉపయోగించలేదు. కరోనా కట్టడికి రోగనిరోధక శక్తి ముఖ్యమని చాలా తక్కువ మందికి తెలుసు. "

- టెడ్రోస్​ అధనోమ్​, డబ్ల్యూహెచ్​ఓ చీఫ్​.

హెర్డ్​ ఇమ్యూనిటీపై తమకు పూర్తిస్థాయిలో సమాచారం లేదన్నారు టెడ్రోస్​. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా మళ్లీ వైరస్​ బారిన పడుతున్నారని, యాంటీబాడీలు తయారవుతున్నా అవి ఎంతకాలం ఉంటాయనేది తెలియటం లేదన్నారు. అది ఒక్కొక్కరిలో ఒకోలా ఉంటుందని తెలిపారు. భయంకరమైన వైరస్​ను ప్రజల్లో సులభంగా వ్యాప్తి చెందేలా చేయటం అనైతికమని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: చైనాపై 'కరోనా' దర్యాప్తునకు డబ్ల్యూహెచ్​ఓ చర్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.