ETV Bharat / international

'వారం రోజుల్లోనే 20 లక్షల కరోనా కేసులు' - #Covid-19

గడిచిన వారంలో ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల మందికి పైగా కొవిడ్​ బారిన పడ్డారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అత్యధికంగా ఐరోపాలో 13 లక్షలకు పైగా కేసులు నమోదైనట్లు పేర్కొంది.

UN: Over 2 million virus cases in just 1 week
'వారం రోజుల్లోనే 20 లక్షల కరోనా కేసులు'
author img

By

Published : Oct 28, 2020, 6:32 PM IST

ప్రపంచవ్యాప్తంగా గడిచిన వారంలో 20 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) తెలిపింది. వైరస్​ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి స్వల్పకాలంలో భారీ సంఖ్యలో కేసులు నమోదవడం గమనార్హం. అత్యధికంగా ఐరోపా 13 లక్షల పైగా కొవిడ్​ కేసులు బయటపడగా... ఇవి ప్రపంచంలో నమోదైన మొత్తం కేసుల్లో 46 శాతమని అధికారులు తెలిపారు.

అత్యధిక వైరస్​ మరణాలు కూడా ఐరోపాలోనే వెలుగుచూస్తున్నాయని డబ్ల్యూహెచ్​ఓ తెలిపింది. గత వారంతో పోల్చుకుంటే 35శాతం కొవిడ్ మరణాలు పెరిగినట్లు వెల్లడించింది. అయితే తొలిదశతో పోల్చుకుంటే కరోనా మరణాలు పాక్షికంగా తగ్గాయని పేర్కొంది.

ఐరోపాలోని 21 దేశాల్లో కొవిడ్​ కారణంగా ఆసుపత్రుల, ఐసీయూల ఆక్యుపెన్సీ పెరిగిందని డబ్ల్యూహెచ్​ఓ గుర్తించింది. కరోనాతో 18శాతం మంది ఆసుపత్రి పాలవగా... 7శాతం మందికి వెంటిలేటర్ల సాయంతో చికిత్స పొందుతున్నారని తెలిపింది.

గడిచిన మూడు వారాలుగా భారత్​, అమెరికా, ఫ్రాన్స్​, బ్రెజిల్​, బ్రిటన్​లో అత్యధికం వైరస్​ కేసులు వెలుగుచూస్తున్నాయని పేర్కొంది.

ఇదీ చూడండి: భారత్​తో సరిహద్దు సమస్య ద్వైపాక్షిక అంశం: చైనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.